ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fake Alcohol: కల్తీ.. కిక్కు..

ABN, Publish Date - Jul 16 , 2025 | 02:29 PM

ఈత, తాటి చెట్ల నుంచి తీసే స్వచ్ఛమైన కల్లుకు బదులుగా కల్తీ కల్లును సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా కేంద్రంలో చెట్లు తక్కు వగా ఉన్నా కల్లు ఎక్కువగా సరఫరా అవుతోంది.

Fake Alcohol

చెట్లు తక్కువ.. కల్లు ఎక్కువ

పేదల ఆరోగ్యంతో చెలగాటం

జిల్లాలో కల్లు వ్యాపారం తీరిది..

మంచిర్యాల క్రైం, జూలై15 (ఆంధ్రజ్యోతి): ఈత, తాటి చెట్ల నుంచి తీసే స్వచ్ఛమైన కల్లుకు బదులుగా కల్తీ కల్లును (Fake Alcohol) సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా కేంద్రంలో చెట్లు తక్కు వగా ఉన్నా కల్లు ఎక్కువగా సరఫరా అవుతోంది. చెట్ల నుంచి వచ్చే కల్లు తక్కువగా ఉంటే ఆ కల్లును పదిం తలు చేసి సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కిక్‌ ఎక్కించే మత్తుపదార్థాలు కలిపి ప్రజల ఆరోగ్యం తో చెలగాటుమాడుతున్నారు. కల్తీబారిన పడి అనేక కుటుంబాలు చితికి పోతున్నాయి. లేని రోగాలను కొని తెచ్చుకొని ఆర్థికంగా దెబ్బతింటున్నారు.

మంచిర్యాల మున్సిపాలిటి పరిధిలో ఒక కల్లు డిపోలో పది కౌంటర్లు ఉన్నాయి. దీనిలో టీసీఎస్‌ పరిధిలో కల్లు దుకాణాలు నాలుగు ఉన్నాయి. మంచి ర్యాల రంగపేట, హమాలీవాడలో ఒకటి, నస్పూర్‌ మండలంలో సంఘ మల్లయ్యపల్లె, శ్రీరాంపూర్‌ పరిధిలో పోలీసుస్టేషన్‌ సమీపంలో రెం డు లైసెన్స్‌ లేకున్నా కల్లు దుకాణాలు నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మంచిర్యాల పట్టణం కాలేజీ రోడ్డులో కల్లు కంపౌండ్‌ నిర్వహిస్తున్నారు. దీనికి 30 కిలోమీటర్ల పరిధిలో ఈత, తాటి కల్లును సేకరించి ఆయా కౌం టర్లకు వాహనం ద్వారా సీసాల ద్వారా సరఫరా చేస్తుంటారు. రోజుకు సుమారు వంద పెట్టెల కల్లును విక్రయి స్తున్నారు. ఒక్క రోజు కల్లు ద్వారా 30వేల నుంచి 40వేల వరకు అమ్ముతుంటారు. చుట్టు పక్కల ప్రాంతంలో కల్లు దొరకక పోవడంతో చెట్ల నుంచి తీసు కల్లులో పెద్దమొత్తంలో నీరు, మత్తును ఇచ్చే రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈత చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినహా మిగితా కల్లు విక్రయాలు జరిగే చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు.

మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ అధికారులు...

ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగు తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఎంత క ల్లు ఉత్పత్తి అవుతుంది. ఎంత వ్యాపారం జరుగుతుం ది. ఎన్ని ఈత, తాటిచెట్లు ఉన్నాయి. అందులో ఎన్ని చెట్ల ద్వారా కల్లును ఉత్పత్తి చేస్తున్నారనే విషయాన్ని అధికారుల వద్ద సంక్షిప్తసమాచారం లేదనే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కఠినంగా వ్యవహరిస్తాం... ఎక్సైజ్‌ సీఐ గురువయ్య

కల్తీ కల్లు అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. డబ్బుల కోసం కల్తీ చేసిన నిషేధిత పదా ర్థాలతో తయారు చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవు.

కాటేస్తున్న కల్తీ కల్లు...

తాటి, ఈత చెట్ల నుంచి తీసే స్వచ్చమైన కల్లుకు బదులుగా నిషేధిత మత్తు పదార్థాలై అల్ర్పాజోలం, డైజో ఫాం వంటి నిషే ధిత పదార్థాలతో కల్లు తయారు చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మంచిర్యాల కల్లు కాంపౌండ్లలో అల్ర్పాజోలం 600 నుంచి 700గ్రాముల మందును కలిపి కల్లును తయారు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నాలుగు రోజుల నుంచి మందు బాబుల్లో మార్పు..

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీకల్లు తాగి 11మంది మృతి చెందడంతో ఎక్సయిజ్‌ అధికారులు మూడు రోజు ల నుంచి ముమ్మర తనిఖీలు చేపట్టారు. దీంతో కల్లు కల్తీ చేయకపోవడం వల్ల తెల్లకల్లుబట్టీల్లో తాగు మం దుబాబులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కల్లుబాగా లేదంటూ కౌంటర్‌లో గొడవలకు సైతం దిగుతున్నారు. కల్తీకల్లు తాగిన అలవాటుకు మామూలు కల్లు తాగడం తోనే వారిలో మార్పు వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు.

డబ్బు సంపాదనే ధ్యేయంగా...

కొందరు కల్లు వ్యాపారులు నిషేధిత డైజోఫాం, అ ల్ర్పాజోలం వంటి మత్తు పదార్థాలను కలుపుతూ ప్ర జలకిక్కు పెంచి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరో పణలు ఉన్నాయి. మత్తు పదార్థాలు కలుపడం ప్రమాదకర మని తెలిసిన ధనార్జనే లక్ష్యంగా వ్యాపారులు కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. ఎక్కు వగా రైతు కూలీలు, పేదలు రోజంత పడిన కష్టాన్ని మరిచిపోయేందుకు కల్లు తాగుతారు. ఈ రసాయ నాలు కలిపిన కల్లు తాగడం వల్ల ఒక్క రోజు తాగక పోయిన వారు పిచ్చిపిట్టినట్లుగా వ్యవహరిస్తారు.

ఇవి కూడా చదవండి..

మల్నాడు డ్రగ్స్‌ కేసు.. నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు

హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2025 | 02:30 PM