ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jagga Reddy: కిషన్‌రెడ్డీ.. కులగణనపై చర్చకు సిద్ధమా?

ABN, Publish Date - May 03 , 2025 | 03:54 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కులగణనపై చర్చకు సిద్ధమా.. కిషన్‌ రెడ్డీ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడి సవాలు విసిరారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలూ మద్దతిచ్చారు.. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ గాంఽధీ ప్రధాని ఖాయం

  • బీజేపీవి అన్నీ డైవర్ట్‌ రాజకీయాలే

  • తెలంగాణలో ఉరికే గుర్రం ఉంది

  • ఎందుకు పొడుస్తున్నావ్‌ కిషన్‌ రెడ్డీ ?

  • టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కులగణనపై చర్చకు సిద్ధమా.. కిషన్‌ రెడ్డీ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడి సవాలు విసిరారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కులగణన చేసిన నెలరోజుల పాటు కిషన్‌రెడ్డి తెలంగాణలో లేరు కాబట్టి ఆయన అవగాహన లేదని ఎద్దేవా చేశారు. అందుకే కులగణనపై కిషన్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో బీజేపీ పక్షనేతతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కుల గణనకు మద్దతిచ్చారని, వాళ్ల మీద కూడా అనుమానమేనా..? అంటూ నిలదీశారు. యాభై యేండ్ల నుంచి ఆర్‌.కృష్ణయ్య బీసీల కోసం కొట్లాడుతున్నారని, కులగణనలో అతని సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుందని, మరి ఆయనకు లేని అనుమానాలు కిషన్‌రెడ్డికి ఎందుకు కలుగుతున్నాయని ప్రశ్నించారు. దేశంలో ఇందిరమ్మ పాలన రాహుల్‌ గాంధీతోనేనని చెప్పారు. కులమతాలకు అతీతంగా పాలన సాగాలి అంటే రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని, అందుకే దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధానిగా చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు కులగణన కమిటీ చైర్మన్‌గా ఉత్తమ్‌.. సభ్యులుగా పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ, సీతక్క, శ్రీధర్‌ బాబు, మల్లు రవి ఉన్నారని, వాళ్లంతా కలిసి సర్వేను విజయవంతంగా పూర్తి చేయించారని కొనియాడారు.


ఈ విజయాన్ని చూసి బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీ లో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్‌ఎస్‌ సభ్యులు కూడా పాల్గొన్నారని వెల్లడించారు. కులగణనను క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అధికారులు సర్వే చేశారని, కిషన్‌ రెడ్డి ఈ విషయం తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కులగణన బిల్లుకు గవర్నర్‌ కూడా ఆమోదముద్ర వేశారు అంటే సర్వే సరిగ్గా జరిగిందనే కదా.. అంటూ వ్యాఖ్యానించారు. కులగణన చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాదరణ చూరగొన్నది కాబట్టి బీజేపీ నేతలు ఓర్వలేక డైవర్ట్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కిషన్‌రెడ్డి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ప్రజలను కోరారు. సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సమయం పొడిగించిందని, బీసీ సంఘాలన్నీ సీఎం రేవంత్‌ను సన్మానించాయని ఆయన తెలిపారు. సర్వే చేస్తేనే.. ఈ బీజేపీ వాళ్లు రాళ్ళు వేస్తున్నారు.. చెయ్యకుండా ఉంటే పెద్ద పెద్ద బండరాళ్లు వేసే వాళ్లేమో అంటూ ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలనేదే రాహుల్‌ గాంధీ అజెండా అని.. అందుకే తెలంగాణలో కులగణన చేయించారని పేర్కొన్నారు. తెలంగాణలో ఉరికే గుర్రం ఉంది.. ఉరికే గుర్రాన్ని ఎందుకు పొడుస్తున్నావు అంటూ కిషన్‌ రెడ్డికి చురకలంటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన సంగతి చూసుక్కొమ్మని హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 03 , 2025 | 03:54 AM