ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ హీరో ఓవర్ యాక్షన్

ABN, Publish Date - May 13 , 2025 | 05:08 PM

Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓవర్ యాక్షన్ చేశారు. కారులో రాంగ్ రూట్‌లో వెళ్లారు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడి కారును అడ్డుకున్నారు.

Tollywood Hero Bellamkonda Sai Sreenivas

హైదరాబాద్, మే 13: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓవర్ యాక్షన్ చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో కారులో రాంగ్ రూట్‌లో వచ్చిన అతడు హల్‌చల్ చేశారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి కారుతో దూసుకు వెళ్లాడు. అయితే కానిస్టేబుల్ అడ్డుకొని నిలదీయడంతో.. బెల్లంకోండ శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్‌లో రావడం ఒక తప్పు అయితే.. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించాడం మరో తప్పు.


అంతేకాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టేందుకు అతడు యత్నించాడు. దీంతో కారులో ఉన్న వ్యక్తి ఎవరనే విషయాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ సరిగ్గా గుర్తించ లేదని తెలుస్తోంది. కానీ వాగ్వివాదం మాత్రం వీరిద్దరి మధ్య చోటు చేసుకుంది. మీరు.. ఇలా రాంగ్ రూట్‌లో రాకుడదు. మీరు ఇలా రావడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందంటూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు కానిస్టేబుల్ తెలియజేశాడు.


ఆ క్రమంలో వారిద్దరి మధ్య కొద్ది పాటి వాగ్వివాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన అంతా సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు తెలుస్తోంది.మరోవైపు ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో.. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీ వద్దనున్న సీసీ కెమెరాలను వారు నిశీతంగా పరిశీలిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: నుదుటి సిందూరం తుడిచినవాని నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం

Vallabhaneni Vamsi: వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

Operation Sindoor: భారత్ దాడుల్లో 11 మంది సైనికులు మృతి: పాకిస్థాన్

For Telangana News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:22 PM