ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MP R Krishnaiah: రిజర్వేషన్లు అమలు చేసి.. ఎన్నికలు నిర్వహించాలి

ABN, Publish Date - Jun 26 , 2025 | 02:25 PM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పందించారు.

MP R krishnaiah

హైదరాబాద్, జూన్ 26: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30వ తేదీ లోపు జరపాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు నిర్వహించడం, బీసీ రిజర్వేషన్లు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాలకే హక్కు ఉందని స్పష్టం చేశారు. సందర్భాన్ని బట్టి 50 శాతం పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటి పెంపులో 50 శాతం సీలింగ్‌కు అడ్డు లేదన్నారు. ఆ క్రమంలో రాజ్యాంగపరమైన అవరోధాలు సైతం లేవని తెలిపారు. త్వరగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి.. ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు అన్ని పార్టీలు ఓకే చెప్పాయని గుర్తు చేశారు. ఈ అంశాన్ని కేంద్రంపైకి నెట్టాల్సిన అవసరం అయితే లేదన్నారు.

కేంద్రంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. సర్పంచ్‌లతోపాటు.. అన్ని ఎన్నికలకు ఇది అప్లై అవుతాయన్నారు. తెలంగాణ జాగృతి నేత, ఎమ్మెల్సీ కవిత ఇటీవల తనను కలిసి.. కొన్ని సలహాలు అడిగిందన్నారు. ఆ క్రమంలో తాను బీసీల కోసం కొట్లాడుతున్నానని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ అంశంపై కొట్లాడాల్సింది కేంద్రంతో కాదని.. రాష్ట్ర ప్రభుత్వంతో అని ఆమెకు తాను వివరించానని చెప్పారు. ప్రజా భరోసా కార్యక్రమంలో ఫీజు రియంబర్స్‌మెంట్‌ కోసం అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చారన్నారు.

ఫీజు చెల్లింపు పెండింగ్‌లో ఉండడం వల్ల విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించక పోవడంతో క్లాసులు ఎగ్గొట్టి మరీ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రెండు, మూడు విడతలుగా బకాయిలు చెల్లించాలని ఈ సందర్బంగా ప్రభుత్వానికి ఆయన సూచించారు. సొంత భవనాలు లేని ప్రాంతాల్లో కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. స్టడీ సర్కిల్‌లో విద్యా ప్రమాణాలు సైతం పెంచాలని ప్రభుత్వానికి ఎంపీ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

నదిలో పడిన బస్సు.. ఒకరు మృతి.. ప్రయాణికులు గల్లంతు

For Telangana News And Telugu News

Updated Date - Jun 26 , 2025 | 04:14 PM