TG Govt: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:55 AM
తెలంగాణలో బోనాలు ప్రారంభమయ్యాయి. అలాంటి వేళ తెలంగాణ సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అందుకు సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.
హైదరాబాద్, జూన్ 26: బోనాలు పండగ ప్రారంభమైన వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న రూ.180.30 కోట్ల మేర మెడికల్ బకాయిలను క్లియర్ చేసినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించనుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులనూ క్లియర్ చేసినట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు.
తెలంగాణలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భారీఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకూ ప్రాధాన్యత ఇస్తూ ఈ బకాయి నిధులు విడుదల చేసినట్లు భట్టి విక్రమార్క సోదాహరణగా విపులీకరించారు. కాగా, పెండింగ్ బకాయిలు విడుదల చేయడంపై ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు స్పందించారు. బోనాల వేళ శుభవార్త చెప్పారంటూ వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన రక్షణ మంత్రి
నదిలో పడిన బస్సు.. ఒకరు మృతి.. ప్రయాణికులు గల్లంతు
For Telangana News And Telugu News