ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్..

ABN, Publish Date - May 06 , 2025 | 01:08 PM

KTR vs Revanth Reddy: కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నారని, ప్రజల ముందు ఉద్యోగులను విలన్‌లుగా చిత్రీకరించే కుట్ర సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అందాల పోటీలకు రూ. 200 కోట్లు ఉన్నాయి కానీ.. ఉద్యోగులకు ఇవ్వటానికి డబ్బులు లేవా అని ఆయన ప్రశ్నించారు.

KTR vs Revanth Reddy

హైదరాబాద్: ‘నన్ను కోసినా ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Leader KTR) కౌంటర్ (Counter) ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... స్వతంత్ర భారతదేశంలోనే అత్యంత అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అని, ఉద్యోగుల (Employees) త్యాగాల గురించి ముఖ్యమంత్రికి ఇసుమంత కూడా తెలియదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ఎన్జీవోల త్యాగల స్పూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఉద్యోగులకు మాజీ సీఎం కేసీఆర్ 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారన్నారు. ఉద్యోగాలు పోయినా.. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి మాటలు బాధాకరమని అన్నారు.


తెలంగాణను శపిస్తే సహించం..

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నారని, ప్రజల ముందు ఉద్యోగులను విలన్‌లుగా చిత్రీకరించే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందాల పోటీలకు రూ, 200 కోట్లు ఉన్నాయి కానీ.. ఉద్యోగులకు ఇవ్వటానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. నాయకత్వ లోపం.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పెట్టిన శాపం అని అన్నారు. తండ్రి లాంటి ముఖ్యమంత్రే సొంత రాష్ట్రానికి శాపాలు పెట్టడం స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేదని అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు మోసమని, వ్యక్తిగతంగా తమపై చేసిన రోత మాటలను సయితం పడ్డామని.. తెలంగాణను శపిస్తే సహించమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read: లిక్కర్ స్కాం.. సంచలన విషయాలు వెలుగులోకి..


అందుకే అప్పు పుట్టడం లేదు...

వేల మంది త్యాగాలతో ఏర్పాడిన తెలంగాణను అవమానించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, పరిపాలన చేతకాదని.. ముఖ్యమంత్రి కాడి పడేశారని కేటీఆర్ విమర్శించారు. నోట్ల కట్లతో దొరికిన రేవంత్ రెడ్డి.. దొంగ కాక మరేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దొంగ కాబట్టే.. అప్పు పుట్టడం లేదన్నారు. కాంగ్రెస్ లాంటి ఎర్రి పార్టీ.. దొంగ చేతికి తాళాలు ఇచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం‌ చేసి.. ఏఐసీసీ, రాహుల్ గాంధీ చాలా పెద్ద తప్పు చేశారన్నారు. తెలంగాణ భవిష్యత్తుకు శాపం పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఢిల్లీ పార్టీలను నమ్మితే మోసపోతామన్న కేసీఆర్ మాటలు నిజమయ్యాయన్నారు. ఇంత దివాలాకోరు మాటలు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదన్నారు. అధికారంలోకి వస్తామని.. కాంగ్రెస్ పార్టీ అనుకోలేదని, అందుకే విచ్చలవిడిగా హామీలు ఇచ్చిందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.


సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులపై కేటీఆర్ కామెంట్స్..

సీఎం రేవంత్ కుటుంబ ఆస్తులపై కేటీఆర్ కామెంట్స్ చేశారు. తెలంగాణ దివాలా తీస్తే.. సీఎం కుటుంబం అస్తులు ఎలా పెరుగుతున్నాయని ప్రశ్నించారు. సీఎం అన్న జగదీష్ రెడ్డి వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టేస్థాయికి ఎలా ఎదిగారన్నారు. ముఖ్యమంత్రి అల్లుడు, వియ్యకుండు అప్పులు మాఫీ అయిపోయాయని, ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి 2 వేల ఎకరాలు కొన్నారని ఆరోపించారు. సీక్రెట్ చెప్తే.. తెలంగాణ ప్రజలు కూడా ఆస్తులు పెంచుకుంటారన్నారు. అభివృద్ది కోసం కేసీఆర్ హాయాంలో అప్పులు చేసిన మాట వాస్తవమని అన్నారు. అందాల పోటీలపై రివ్యూ చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ కట్టారని తెలిపారు. ఒకవైపు దివాలా కోరు మాటలు.. మరోవైపు తెలంగాణ రైజింగ్.. ఏది వాస్తవమని అన్నారు. పరిపాలన చేతకాకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్‌ను ఇకపై వ్యక్తిగతంగా మట్లాడితే రేవంత్ రెడ్డి నాలుక చీరేస్తామన్నారు. ఎకానమీ క్లాస్‌‌లో ప్రయాణం చేస్తున్నానని సీఎం అబద్దాలు చెప్తున్నారని, సీఎం ప్రైవేట్ ట్రిప్పులు, జలసాలను బయట పెడతామన్నారు. నల్లగొండ మంత్రులు హెలికాప్టర్‌ను షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదని, తెలంగాణ కాదు.. కాంగ్రెస్ పార్టీ దిచాలా తీసిందన్నారు. ముఖ్యమంత్రి సోదరుల అరాచకాల వలనే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. అడ్డమైన మాటలు బంద్ చేసి.. రేవంత్ రెడ్డి బుర్ర పెంచుకోవాలని, రేవంత్ రెడ్డి హాయాంలో లిక్కర్ మాత్రమే పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై కేటీఆర్ కామెంట్స్

బుధవారం (7వ తేదీ) నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాలని మేము కోరుకోవడం లేదన్నారు. కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏ ఉద్యోగులు అయినా.. సమ్మెకు పోకూడదనే తాము కోరుకుంటున్నాని కేటీఆర్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంబర్‌పేట ఫ్లైఓవర్ ప్రారంభించిన నితిన్ గడ్కరీ (ఫోటో గ్యాలరీ)

సివిల్ డిఫెన్స్ డ్రిల్‌పై కీలక సమావేశం..

ఏపీపీఎస్సీ నియామకం కేసులో కీలక పురోగతి...

For More AP News and Telugu News

Updated Date - May 06 , 2025 | 01:41 PM