ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR Challenges CM Revanth: 72 గంటలు టైం ఇస్తున్నా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

ABN, Publish Date - Jul 05 , 2025 | 01:35 PM

KTR Challenges CM Revanth: కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలని సవాల్ చేశారు.

KTR Challenges CM Revanth

హైదరాబాద్, జులై 5: రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఛాలెంజ్ విసిరారు. ఈరోజు (శనివారం) మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 8న ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. 72 గంటల సమయం ఇస్తామని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలన్నారు. పేటీఎం మాదిరి.. పే సీఎంగా రేవంత్ పేరు సంపాదించారని విమర్శించారు. రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎగ్గొడుతోందని మండిపడ్డారు. అన్నదాతకు సున్నం పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమంటూ విరుచుకుపడ్డారు. రైతు సమస్యలపై చింతమడకు, కొండారెడ్డిపల్లె అయినా సరే.. రేవంత్ రెడ్డితో చర్చకు రెడీ అని స్పష్టం చేశారు.

నిజం ఒప్పుకోని వాడిని.. నటించే వాడిని రేవంత్ రెడ్డి అంటారు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలని సవాల్ చేశారు. నాలుగు వేల పెన్షన్, రూ. 2,500 కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో సీఎం సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలవదన్నారు.

‘వందనా.. వాళ్ళ‌ బొందనా? వంద సీట్లు కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. వంద గెలవాలంటే.. ముందు ప్రజలు ఓట్లు వేయాలి కదా. రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ మాత్రమే తెలంగాణలో జోరు మీదుంది. గుడ్డలు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని రేవంత్ చెప్పటం సిగ్గుచేటు. రేవంత్‌కు బేసిన్ తెలియదు.‌. బెండకాయ తెలియదు’ అంటూ ఎద్దేవా చేశారు. ఎరువులు ఇవ్వటం చేతకాని వాడికి కేసీఆర్‌తో చర్చ ఎందుకని నిలదీశారు. ఏ రైతు, ఏ ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆర్ అని చెప్తారన్నారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మత్స్య సంపదను సృష్టించిందే కేసీఆర్ అని అన్నారు. హారతులు పట్టి ఆంధ్రాకు నీటిని పంపిందే కాంగ్రెస్ నేతలు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి

రండి.. కలిసికట్టుగా ముందుకు సాగుదాం.. సీఎం విజ్ఞప్తి

గంజాయి స్మగ్లింగ్‌లో కొత్త పంథా.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 05 , 2025 | 04:40 PM