KTR Criticizes Congress: ఇచ్చిన తేదీ దాటిపాయే... సన్నాలు ఏవీ సారూ
ABN, Publish Date - Mar 19 , 2025 | 10:02 AM
KTR Criticizes Congress: పేదలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్, మార్చి 19: కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt) మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR). ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. సన్న బియ్యం కొంటామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే లేదని అన్నారు. ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇచ్చిన హామీల్లో ఏదీ కూడా అమలు జరగడంలేదని.. అన్నింటిలో కటాఫ్‌లే అంటూ ఫైర్ అయ్యారు. సన్న బియ్యం అంటూ ఊదరగొట్టి ఉన్న బియ్యం కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అంటూ మాజీ మంత్రి ఎక్స్ వేదికగా మరోసారి మాటల తూటాలు పేల్చారు.
కేటీఆర్ ట్వీట్ ఇదే...
కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టు - సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డుబియ్యం కూడా ఇయ్యలే అంటూ ఫైర్ అయ్యారు. రైతుల నుంచి సన్నాలు కొన్నది లేదని.. సన్నాలకు బోనస్ రూ.500 ధర ఇచ్చింది లేదన్నారు. మార్చి నుంచి పేదలకు సన్నబియ్యం అని ప్రకటనలు ఇచ్చి.. పదో తేదీ దాటినా పేదలకు రేషన్ బియ్యం కూడా ఇవ్వని అసమర్థ ప్రభుత్వం అని అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు బుక్కెడు బువ్వ పెట్టని కాంగ్రెస్ సర్కార్.. సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విరుచుకుపడ్డారు. లక్ష 54 వేల మెట్రిక్ టన్నులకు గాను రేషన్ దుకాణాలకు కేవలం 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసి ఇందిరమ్మ ప్రభుత్వ చేతులు దులుపుకుందన్నారు. కొత్త ఏడాది ఉగాదికి సన్నబియ్యం అని సన్నాయి నొక్కులు నొక్కి ఉన్న బియ్యం ఊడబీకింది కాంగ్రెస్ ప్రభుత్వమంటూ మండిపడ్డారు. ప్రజాపాలన అంటే పస్తులేనా అని.. ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించారు.
‘రైతులకు రుణమాఫీ కట్
రైతులకు రైతుభరోసా కట్
రైతులకు రైతుబీమా కట్
ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ కట్
గర్భవతులకు న్యూట్రిషన్ కిట్ కట్
విద్యార్థినులకు హెల్త్ కిట్, ఎలక్ట్రిక్ స్కూటీ కట్
మహిళలకు నెలకు రూ.2500 మహాలక్ష్మి కట్
ఆఖరికి పేదలకు రేషన్ బియ్యం కట్
కాంగ్రెస్ అంటే కటింగ్
కాంగ్రెస్ అంటే కన్నింగ్’ జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ సామాజిక మాద్యం ఎక్స్‌లో పోస్టు చేశారు. అంతే కాకుండా #CongressFailedTelangana అనే హ్యాష్ ట్యాగ్ తన ట్వీట్‌కు జతచేశారు.
ఇవి కూడా చదవండి...
Big Shock To YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. మరో నేత జంప్
Minister Seethakka: ఎమ్మెల్యే స్టిక్కర్ దుర్వినియోగం..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 19 , 2025 | 11:47 AM