Share News

Minister Seethakka: ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం..

ABN , Publish Date - Mar 19 , 2025 | 07:42 AM

రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)కు సంబంధించిన అసెంబ్లీ కార్‌ పాస్‌ స్టిక్కర్‌ దుర్వినియోగంపై మంత్రి పీఆర్వో సోమవారం రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Minister Seethakka: ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం..

- పోలీసులకు మంత్రి సీతక్క పీఆర్‌ఓ ఫిర్యాదు

హైదరాబాద్: మంత్రి సీతక్క(Minister Seethakka)కు సంబంధించిన అసెంబ్లీ కార్‌ పాస్‌ స్టిక్కర్‌ దుర్వినియోగంపై మంత్రి పీఆర్వో(Minister PRO) సోమవారం రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్క బేగంపేట ప్రజాభవన్‌(Begumpet Praja Bhavan) సముదాయంలోని ఓ భవనంలో నివాసం ఉంటున్నారు. మంత్రి సీతక్కకు మూడు ఎమ్మెల్యే స్టిక్కర్లను కేటాయించారు. అయితే, అందులో ఒక స్టిక్కర్‌ దుర్వినియోగం అయ్యింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హలో నాగమణి.. అమ్మాయి కావాలి


టీఆర్‌ నంబర్‌ ఉన్న థార్‌ వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్‌(MLA Sticker) అతికించుకుని ఓ వ్యక్తి తిరుగుతున్నారని గుర్తించారు. స్టిక్కర్‌ వేరే వారి చేతుల్లోకి వెళ్లడంతో విషయం మంత్రి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె పీఆర్‌ఓ పాండునాయక్‌(PRO Pandunayak) పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు థార్‌ వాహనం కోసం గాలిస్తున్నారు. స్టిక్కర్‌ బయటికి ఎలా వెళ్లిందని ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?

కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 19 , 2025 | 07:42 AM