ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Police Raids: హైదరాబాద్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ABN, Publish Date - Jun 14 , 2025 | 08:27 AM

భాగ్యనగరంలో ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. గచ్చిబౌలి‌లోని పలు పబ్బులపై రైడ్స్ చేశారు. ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్‌లోని పబ్బుల్లో పోలీసులు డ్రగ్స్ తనిఖీలు నిర్వహించారు.

Hyderabad SOT Police Raids

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఐటీ హబ్, స్మార్ట్ సిటీగా పేరుగాంచినప్పటికీ.. ఇటీవల డ్రగ్స్ కేసులు, మత్తుమందుల వినియోగం బాగా పెరిగిపోతున్నాయి. యవత వీటి బారిన పడి జీవితాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా పబ్‌లు, క్లబ్‌లల్లో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు (Hyderabad SOT Police Raids) శనివారం నిర్వహించిన తనిఖీలు సంచలనంగా మారాయి.

భాగ్యనగరంలో ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు ఇవాళ(శనివారం) విస్తృత తనిఖీలు చేపట్టారు. గచ్చిబౌలి‌లోని పలు పబ్బులపై ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేశారు. ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్‌లోని పబ్బుల్లో, క్లబ్ రోగ్, ఫ్రాట్‌హౌస్ పబ్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ రైడ్స్‌లో భాగంగా ఎస్ఓటీ పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. మొత్తం నలుగురికి గంజాయి పాజిటివ్‌గా తేలింది. గంజాయి పాజిటివ్ వచ్చినవారిలో ఫ్రాట్ హౌస్ పబ్ డీజే ప్లేయర్ శివ ఉన్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పబ్ డీజే ప్లేయర్‌కి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరి దగ్గర కొనుగోలు చేశాడు. ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. శివతో పాటు డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిన మరో ముగ్గురిపై కూడా కేసులు నమోదు చేసి వారి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు తెలిపారు. డ్రగ్స్ బారిన పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తమకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

ఇవి కూడా చదవండి

మరోసారి సిట్ ముందుకు ప్రణీత్ రావు

పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 08:42 AM