ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Miss World 2025: హైదరాబాద్‌లో గ్లోబల్ బ్యూటీస్ ఎంట్రీ.. డ్రోన్లకు మాత్రం నో ఎంట్రీ..

ABN, Publish Date - May 06 , 2025 | 07:12 PM

Miss World 2025 Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మే 10 నుంచి మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని ఈ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లను నిషేధించారు.

Miss World 2025 Hyderabad

Miss World 2025 Hyderabad Drone Restrictions: తెలంగాణ ఖ్యాతి ప్రపంచ నలుదిశలా చాటేలా మిస్ వరల్డ్ 2025 పోటీలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మే 10 నుంచి మే 31 వరకూ జరగనున్న ఈ పోటీలకు దేశవిదేశాల నుంచి అందాల భామలు, మీడియా ప్రతినిధులు, ప్రముఖులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. అతిథులు భాగ్యనగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉన్నందున రక్షణా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రధానంగా ఈ 10 ప్రాంతాల్లో డ్రోన్లను నిషేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.


భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNS) 2023లోని సెక్షన్ 163 ప్రకారం నగరంలోని 10 ప్రాంతాలలో డ్రోన్లను ఎగరవేయడాన్ని నిషేధించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ క్రింది ప్రాంతాలలో రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు లేదా పారా-గ్లైడర్లు లేదా రిమోట్ కంట్రోల్డ్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎగిరేందుకు అనుమతి లేదు.


  • చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, ఖిల్వత్, షాలిబండ (మే 13న)

  • TGICCC రోడ్ నంబర్ 12, తెలంగాణ రాష్ట్ర సచివాలయం, ట్యాంక్ బండ్ (మే 18న)

  • రాజ్ భవన్, సోమాజిగూడ రోడ్డు (జూన్ 2న) ఆంక్షలు అమలులో ఉంటాయి.


ఇదిలా ఉండగా, మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో జరగనున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల సందర్భంగా విదేశీ అతిథులు బస చేసే హోటళ్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సెక్రటేరియట్ చుట్టూ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన పోలీసులకు చెప్పారు.


Read Also: Sridhar Babu: సీఎం రేవంత్‎ను సమర్థిస్తూనే బీఆర్ఎస్‎కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

Sabitha Indra Reddy: కన్నీళ్లతో మెట్లెక్కానంటూ.. గుర్తు చేసుకున్న మాజీ మంత్రి సబిత

Seethakka Slams KTR : మీ సత్తా నిరూపించుకోండి.. కేటీఆర్‌కు సీతక్క సవాల్

Updated Date - May 06 , 2025 | 07:44 PM