Share News

Sabitha Indra Reddy: కన్నీళ్లతో మెట్లెక్కానంటూ.. గుర్తు చేసుకున్న మాజీ మంత్రి సబిత

ABN , Publish Date - May 06 , 2025 | 06:36 PM

Sabitha Indra Reddy: ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె స్పందించింది.

Sabitha Indra Reddy: కన్నీళ్లతో మెట్లెక్కానంటూ.. గుర్తు చేసుకున్న మాజీ మంత్రి సబిత
BRS Leader Sabitha Indra Reddy

హైదరాబాద్, మే 06: ఓబులాపురం మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా సీబీఐ కోర్టు ప్రకటించడం పట్ల మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆమెను సీబీఐ కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తనను నిర్దోషిగా ప్రకటించిన కోర్టుకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. 12 ఏళ్ల పాటు ఈ కేసులో న్యాయం కోసం పోరాటం చేశానన్నారు. ఈ సందర్భంగా పలు అవమానాలు సైతం తాను ఎదుర్కున్నానని ఆమె గుర్తు చేసుకున్నారు.

తనను చాలా మంది అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఓబులాపురం మైనింగ్ కేసు నమోదయిన అనంతరం ఇదే సీబీఐ కోర్టుకు తాను కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కానని చెప్పారు. అయితే తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. తనపై రాజకీయంగా ఎన్నో ఆరోపణలు చేశారన్నారు. తాను అవినీతి చేశానని... జైలుకు వెళ్తానంటూ హేళన సైతం చేశారన్నారు.ఇటువంటి నేపథ్యంలో తాను నిర్దోషినంటూ ప్రకటించడంతో కోర్టుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితులను ఇప్పటికే దోషులుగా తేల్చుతూ వారికి శిక్షలు సైతం కోర్టు ఖరారు చేసింది. ఏ1 శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఈ కేసులో కీలక నిందితుడి ఏ2 మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డికి ఏడు ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డితోపాటు ఐఏఎస్ కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 14 ఏళ్లపాటు ఈ కేసును సీబీఐ కోర్టు విచారించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

Nadendla Manohar: కొత్త రేషన్ కార్డుల జారీ.. ఎప్పటినుంచంటే..

PAN Card: పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..

Security Mock Drill: హైదరాబాద్‌లోని ఆ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్.. ఎప్పుడంటే..

India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి

Minister Satya Kumar: వైద్యులపై హెల్త్ మినిస్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం

CM Chandrababu: ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2025 | 06:36 PM