Nadendla Manohar: కొత్త రేషన్ కార్డుల జారీ.. ఎప్పటినుంచంటే..
ABN , Publish Date - May 06 , 2025 | 06:10 PM
Nadendla Manohar: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు బుధవారం నుంచి జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. క్యూ ఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సభ్యులు పేర్ల అన్ని చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ చేస్తామన్నారు.
అమరావతి, మే 06: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు బుధవారం నుంచి జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అందుకు రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. మంగళవారం అమరావతిలో మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ.. కొత్త కార్డులు జారీ, రేషన్ కార్డులు స్ప్లిట్, కొత్త సభ్యుల చేరికతోపాటు చిరునామా మార్పు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. రేషన్ కార్డులో మార్పు కోసం ఇప్పటి వరకు 3. 28 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
క్యూ ఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సభ్యులు పేర్ల అన్ని చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ చేస్తామన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలుగా రేషన్ తీసుకున్న వివరాలు సైతం కనిపించేలా వీటిని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందన్నారు.
కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు కోసం.. ఒక నెల రోజులు గడువు ఇస్తున్నామన్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పౌరులు తమ వివరాలను సైతం తెలుసుకో వచ్చునన్నారు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ అవుతుందని ఆయన స్సష్టం చేశారు. జూన్ నుంచి ఈ స్మార్ట్ కార్డులు జారీ అవుతాయన్నారు. ప్రస్తుతం 95 శాతం మేర ఈ కేవైసి పూర్తయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ కేవైసి పూర్తయిన వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఈ కేవైసి కోసం ఆలస్యం అయ్యిందన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ నెల 12 తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. ఈ అంశంపై బుధవారానికి పూర్తి వివరాలు అందుతాయన్నారు. అకాల వర్షంతో రైతులకు పంట నష్ట పరిహారం అందరికీ అందజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ 1.50 కోట్ల మందికి దీపం పథకం ద్వారా లబ్ది చేకూరిందని వివరించారు. పాఠశాలలకు 25 కేజీల ఫైన్ క్వాలిటీ రైస్ ఈ ఏడాది నుంచి సరఫరా చేయబోతున్నామని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
PAN Card: పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..
Security Mock Drill: హైదరాబాద్‌లోని ఆ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్.. ఎప్పుడంటే..
India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి
Minister Satya Kumar: వైద్యులపై హెల్త్ మినిస్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
CM Chandrababu: ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
For Andhrapradesh News And Telugu News