పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. వాహనం కొనుగోలు చేయాలన్నా.. భూమికి సంబంధించి క్రయ విక్రయాలు జరపాలన్నా.. ఆస్తుల కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఇలా ప్రతి ఒక్కదానికి పాన్ కార్డు నేడు తప్పని సరి అయిపోయింది. పాన్ కార్డు లేకుంటే క్రయ విక్రయాలు జరగని పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో.. పాన్ కార్డు సైతం అంతే ముఖ్యమన్నది సుస్పష్టం. మరి ఈ రెండు కార్డులు లింక్ చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది.
అందుకోసం గడువు విధించింది. దానిని సైతం పొడిగించింది. అది కాస్తా ముగియడంతో.. ఆధార్ కార్డ్, పాన్ కార్డులను లింక్ చేయడం కోసం ప్రస్తుతం కేంద్రం గట్టిగానే ఛార్జ్ చేస్తోంది.
పాన్ కార్డు కోసం పురుషులే కాదు.. మహిళలు సైతం అప్లై చేస్తారు. అయితే ఎవరికైనా పాన్ కార్డులో తండ్రి పేరే ఉంటుంది. మహిళకు వివాహం అయితే.. ఆ తర్వాత ఆమె బాగోగులు అన్నీ ఆమె భర్తే చూసుకొంటాడన్న విషయం అందరికి తెలిసిందే.
మరి మహిళలు అప్లై చేస్తే.. వారి భర్త పేరు కాకుండా పాన్ కార్డులో వారి తండ్రి పేరే ఎందుకు ఉంటుందనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా?. లేదా? అందుకు కొన్ని కారణాలున్నాయి.
మహిళలకు చిన్న వయస్సులోనే ఉద్యోగాలు వస్తే.. అంటే వివాహం కాక ముందే ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. ఆమెకు ఆ ఇంటి పేరే ఉద్యోగం చివర వరకు కొనసాగుతోంది. ఉద్యోగ నిర్వహాణలో భాగంగా ఎక్కడ సంతకం చేయాల్సి వచ్చినా.. తన పుట్టింటి పేరుతోనే ఆమె సంతకం చేస్తుంది.
అలాగే మరికొందరు మహిళలు వివిధ కారణాల వల్ల రెండో వివాహం చేసుకొంటారు. ఇంకొంతమంది మహిళలు విడాకులు తీసుకుంటారు. ఇక వితంతువులు కూడా ఉంటారు.
ఈ నేపథ్యంలో మహిళలు.. పాన్ కార్డులో భర్త స్థానంలో పేర్లు మార్చ వలసి వస్తోంది. అలాంటి వేళ.. మహిళలకు తండ్రి ఒక్కరే ఉంటారు. ఈ నేపథ్యంలో పాన్ కార్డులో మహిళలకు తండ్రి పేరును ఆదాయపు పన్ను శాఖ వారు తప్పని సరి చేశారు.