TG NEWS: ఎట్టకేలకు అఘోరి అరెస్ట్.. విచారిస్తున్న నార్సింగి పోలీసులు
ABN, Publish Date - Apr 23 , 2025 | 11:34 AM
Aghori Alluri Srinivas Arrested: అఘోరి అల్లూరి శ్రీనివాస్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అఘోరి..అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం సంచలనంగా మారింది. అఘోరిని అరెస్ట్ చేయాలని పెద్దఎత్తున ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. అఘోరిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు ఇవాళ (బుధవారం) తీసుకువచ్చారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో అఘోరీను ఏసీపీ విచారణ చేస్తున్నారు. సైబరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసుతో పాటు బెదిరింపుల కేసులో అదుపులోకి అఘోరిని తీసుకున్నారు. ఓ మహిళ వద్ద నుంచి తాంత్రిక పూజల పేరుతో అఘోరి రూ. 10 లక్షలు కాజేసి మోసం చేశాడనే ఫిర్యాదులు కూడా పోలీసులకు అందాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఉజ్జయినికి తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసినట్లు పోలీసులకు బాధిత మహిళ తెలిపింది. తనను మోసం చేసినట్లు ఫిబ్రవరి 25వ తేదీన మొకిలా పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అఘోరితో పాటు శ్రీ వర్షిణిని కూడా హైదరాబాద్‌కు పోలీసులు తీసుకువచ్చారు. చాలా వివాదాల అనంతరం అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో అఘోరిని అరెస్ట్ చేయాలని ప్రజల నుంచి సైతం డిమాండ్ వచ్చింది. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అఘోరిని విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో పలు విషయాలు వెల్లడవుతున్నాయి. అఘోరి చేతిలో మోసపోయిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.
కాగా.. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో అఘోరీ విచారణ ముగిసింది. చేవెళ్ల కోర్టుకు ఇవాళ అఘోరిని మోకిలా పోలీసులు తరలించారు. చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు అఘోరీని పోలీసులు హాజరుపర్చనున్నారు. అనంతరం అఘోరీని మోకిలా పోలీసులు రిమాండ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో అఘోరీ మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు. తన కేసు కోర్టు పరిధిలో ఉందని.. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని అన్నారు. తన భార్య వర్షిణి తనతోనే ఉంటుందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Election: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ప్రారంభం..
TGSRTC: ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు
Osmania University: ఆర్ట్స్ కాలేజీకి ట్రేడ్ మార్క్ గుర్తింపు
Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 23 , 2025 | 11:48 AM