ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tribute: మాగంటి గోపీనాథ్ నివాసానికి సీఎం చంద్రబాబు..?

ABN, Publish Date - Jun 08 , 2025 | 12:11 PM

CM Chandrababu: జూబ్లీహిల్స్‌లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నట్లు సమాచారం. అలాగే మాజీ సీఎం కేసీఆర్ మరికాసేట్లో రానున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. కాగా గోపీనాథ్ నివాసంలోనే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు.

CM Chandrababu Naidu visit, Maganti Gopinath residence

Hyderabad: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవితచరిత్ర ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పాల్గొననున్నారు. తర్వాత మాగంటి గోపీనాథ్ నివాసానికి (Maganti Gopinath Residence) వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మాగంటి గోపీనాథ్ నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) మరికాసేట్లో రానున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. గోపీనాథ్ నివాసంలోనే కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) ఉన్నారు.


కోలుకుంటారని భావించాను.. పవన్ కళ్యాణ్

బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ నియోజకవర్గం శాసన సభ్యుడు, సినీ నిర్మాత మాగంటి గోపీనాథ్ కన్నుమూశారని తెలిసి చింతించానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించానని తెలిపారు. మాగంటి కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోనై, ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందని.. కోలుకుంటారని భావించానని అన్నారు. 2014 నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ నియోజకవర్గం అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారని కొనియాడారు. మాగంటి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.


మాగంటి చాలా నిరాడంబరుడు..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ.. మాగంటి కుటుంబం మనో నిబ్బరంతో ఉండాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాగంటి చాలా నిరాడంబరుడని, వివాద రహితుడని పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావుతో కలిసి పని చేసినప్పటి నుంచి మాగంటి తనకు తెలుసునని అన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పని చేసే వ్యక్తి అని కొనియాడారు. మూడు సార్లు ఎంఎల్ఏగా గెలిచినా గర్వం లేని వ్యక్తి అని, తన కోసం తన కుటుంబం కోసం ఏనాడు ఆలోచించలేదని అన్నారు. కేసీఆర్‌ను ఎప్పుడు కలిసిన జూబ్లీ హిల్స్ నియోజక వర్గ సమస్యల గురించే ప్రస్తావించేవారని, బీఅర్ఎస్ పార్టీ మాగంటి కుటుంబానికీ అండగా ఉంటుందని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.


తట్టుకోవడం కష్టమైంది.. సబితా

మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంట్లో మాట్లాడుతూ పడిపోయారని మాగంటి భార్య చెబితే తట్టుకోవడం కష్టమైందన్నారు. కార్యకర్తలను నిత్యం అందుబాటులో ఉండేవారని, కాలనీ సంక్షేమ సంఘాలకు పెద్ద దిక్కుగా ఉండేవారని, ఆయన అహం చూపించకుండా బతికారని, మాగంటి లేని లోటు తట్టుకునే శక్తిని ఆ దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

మంచి మిత్రుడిని కోల్పోయా.. దానం నాగేందర్

మాగంటి గోపీనాథ్‌తో 30 సంవత్సరాలుగా అనుబంధం ఉందని, మంచి మిత్రుడిని కోల్పోవడం బాధగా ఉందని ఎంఎల్ఏ దానం నాగేందర్ అన్నారు. సౌమ్యుడిగా వివాద రహితుడిగా మాగంటి కొనసాగారని.. నిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి అని.. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. మాగంటి కుటుంబం మనో నిబ్బరంతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రకరకాల సమస్యలు ఆయనను చాలా బాధ పెట్టాయని దానం నాగేందర్ అన్నారు.


ఇవి కూడా చదవండి:

అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు..

పట్టరాని కోపంతో రగిలిపోతున్న జగన్

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 12:11 PM