YCP: పట్టరాని కోపంతో రగిలిపోతున్న జగన్
ABN, Publish Date - Jun 08 , 2025 | 10:23 AM
Jagan Anger: తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన జగన్మోహన్‌రెడ్డి ఇటు ప్రజల పైన, అటు రాజకీయ ప్రత్యర్థులపైన పట్టరాని కోపంతో రగిలిపోతున్నారు.
Amaravati: తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన జగన్మోహన్‌రెడ్డి (Jaganmohan Reddy) ఇటు ప్రజల పైన, అటు రాజకీయ ప్రత్యర్థులపైన పట్టరాని కోపం (Anger)తో రగిలిపోతున్నారు. ఆగ్రహావేశాలతో తాను ఏమి చేస్తున్నానో కూడా ఆయన మరచిపోతున్నారు.
‘జగనన్న ఉండగా నేరస్తులు అందరికీ పండగే’ అన్న పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నట్టుగా ఉంది. అలా అని అతడిని తెలివి తక్కువవాడిగా భావించడానికి కూడా లేదు. రాష్ట్రంలో రాజకీయాలను మరో లెవల్‌కు తీసుకు వెళ్లే పనిలో జగన్ బిజీగా ఉంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో పేరు మోసిన ముగ్గురు నేరస్తులను పోలీసులు ఇటీవల నడిరోడ్డుపై చితకబాదారు. ఆ ముగ్గురూ దళితులు కావడంతో దొరకునా ఇటువంటి మహదావకాశం అన్నట్టుగా జగన్‌రెడ్డి ఆ ముగ్గురి కుటుంబాల పరామర్శకు వెళ్లారు. దీనిపై సామాన్య ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఏర్పడింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు..
మాగంటి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
For More AP News and Telugu News
Updated at - Jun 08 , 2025 | 10:23 AM