ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asaduddin Owaisi: జైల్లో ఉండగానే తండ్రయ్యాడు: అసదుద్దీన్ ఒవైసీ

ABN, Publish Date - Jun 01 , 2025 | 08:44 AM

ఉగ్రవాది జకీర్ రెహమాన్ లఖ్వీ పాక్ జైల్లో ఉండగానే తండ్రి అయ్యాడు.. ఇదీ.. పాకిస్థాన్ పాపాల బ్రతుకు అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. అల్జీరియా దేశం ముందు పాక్ చేస్తున్న దురాగతాల్ని కళ్లకు కట్టినట్టు వివరించారు అసద్.

Asaduddin Owaisi exposes Pakistan in Algeria

ఇంటర్నెట్ డెస్క్: దాయాది దేశం పాకిస్థాన్ పాపాల బ్రతుకుని ప్రపంచ దేశాల ముందు నగ్నంగా నెలబెడుతున్నారు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఆపరేషన్ సిందూర్ ఔట్ రీచ్‌లో భాగంగా భారత అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. టెర్రరిజాన్ని పాకిస్థాన్ ఎలా పెంచి పోషిస్తోందన్న విషయాల్ని ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండ నేతృత్వంలోని అసద్ టీం ఇవాళ అల్జీరియాలో పర్యటిస్తోంది.

ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని పెంపొందించడంలో పాకిస్తాన్ చేస్తున్న నిర్వాకాలపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడానికి ఇస్లామాబాద్ తీసుకుంటున్న కుతంత్రాలు దక్షిణాసియాలో అస్థిరతకు కారణమవుతున్నాయని అసద్ అన్నారు. అల్జీరియాలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఓవైసీ పాకిస్థాన్ చేస్తున్న నీచపు పనుల్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఒక ఉగ్రవాది తండ్రి అయ్యాడని అసద్ చెప్పారు. జైలులో ఉగ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ ప్రత్యేకంగా చూసుకుంటున్న తీరును హైదరాబాద్ ఎంపీ తీవ్రంగా విమర్శించారు.


"జకీర్ రెహమాన్ లఖ్వీ అనే ఒక ఉగ్రవాది ఉన్నాడు. ప్రపంచంలో ఏ దేశమూ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదిని (జైలు నుండి బయటకు రావడానికి)అనుమతించదు. కానీ అతను జైలులో ఉండగానే ఒక కొడుకుకు తండ్రి అయ్యాడు." అని అసదుద్దీన్ తెలిపారు.

పాకిస్తాన్‌ను తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో ఉంచితేనే ప్రపంచానికి శాంతి చేకూరుతుందని ఎంపీ అసద్ తేల్చి చెప్పారు. FATF(Financial Action Task Force) గ్రే లిస్ట్ లోకి పాకిస్తాన్‌ను తిరిగి తీసుకురావడంలో భారతదేశానికి సహాయం చేయాలని అసదుద్దీన్ ఒవైసీ అల్జీరియాను కోరారు. 2018లో పాకిస్తాన్‌ను తిరిగి గ్రే లిస్ట్‌లోకి తీసుకువచ్చిన తర్వాత భారతదేశంలో ఉగ్రవాదం తగ్గుదల చూశామని అసద్ అన్నారు.

ఉగ్రవాద మూలాల గురించి అసద్ మాట్లాడుతూ, "ఉగ్రవాదం రెండు విషయాలపై మనుగడ సాగిస్తుంది. అవి ఒకటి భావజాలం రెండు డబ్బు. ఈ విషయంలో పాకిస్థాన్ తనకు మతపరమైన అనుమతి ఉందని భావిస్తోంది. కాని ఇది పూర్తిగా తప్పు. ఇస్లాం ఏ వ్యక్తినీ చంపడానికి అనుమతించదు. దురదృష్టవశాత్తు అదే వారి సిద్ధాంతం" అని అసద్ అన్నారు.


ఇవి కూడా చదవండి

జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం

ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్లు.. లా స్టూడెంట్ అరెస్ట్..

Updated Date - Jun 01 , 2025 | 09:45 AM