Share News

Pune Law Student: ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్లు.. లా స్టూడెంట్ అరెస్ట్..

ABN , Publish Date - May 31 , 2025 | 05:02 PM

Pune Law Student: ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ శర్మిష్ట కామెంట్లు చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. తాను తప్పు చేశానని గుర్తించిన శర్మిష్ట వీడియోను వెంటనే డిలీట్ చేసింది.

Pune Law Student: ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్లు.. లా స్టూడెంట్ అరెస్ట్..
Pune Law Student

పహల్గామ్ ఉగ్రదాడిలో పసుపు, కుంకుమలు కోల్పోయిన వారికి న్యాయం చేయటం కోసం భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. భారత ఆర్మీ చేపట్టిన ‘ ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కొంతమంది మాత్రం అనవసరంగా నోరు పారేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి తప్పుగా మాట్లాడారు.


పుణెకు చెందిన శర్మిష్ట పనోలి అనే లా స్టూడెంట్ కూడా ఆపరేషన్ సిందూర్ గురించి తప్పుగా మాట్లాడింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని రోజుల క్రితం ఓ పోస్టు పెట్టింది. ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. తాను తప్పు చేశానని గుర్తించిన శర్మిష్ట వీడియోను వెంటనే డిలీట్ చేసింది. తన ఎక్స్ ఖాతాలో ఓ క్షమాపణ పోస్టు పెట్టింది. ‘ నాకు ఎవర్నీ బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం లేదు.


ఆ వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగతం మాత్రమే. నా వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి’ అని పేర్కొంది. అయితే, అప్పటికే పరిస్థితి చెయ్యిదాటి పోయింది. ఆపరేషన్ సిందూర్‌పై ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కోల్‌కతాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. శుక్రవారం కోల్‌కతా పోలీసులు షర్మిష్టను గురుగ్రాములో అరెస్ట్ చేశారు. ఈ రోజు(శనివారం) ఆమెను అలీపోర్ కోర్టులో హాజరుపరిచారు. శర్మిష్ట అరెస్ట్‌పై పోలీసులు మాట్లాడుతూ.. ‘ శర్మిష్టకు, ఆమె కుటుంబానికి చాలా సార్లు నోటీసులు పంపాము. ఎవరూ పట్టించుకోలేదు. తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. శుక్రవారం గురుగ్రాములో ఆమెను అరెస్ట్ చేశాము’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

అన్నదమ్ముల మధ్య గొడవ.. విడిపించడానికి వెళ్లిన తల్లిని..

మేఘా వేమూరిపై కాలేజ్ ఎందుకు బ్యాన్ విధించిందంటే..

Updated Date - May 31 , 2025 | 05:10 PM