Hyderabad: అసభ్యకర మాటలు, చేష్టలతో పెళ్లి ఇంట్లో హిజ్రాల హల్‌చల్
ABN, Publish Date - May 15 , 2025 | 10:52 AM
నగరంలోని కొన్ని ఏరియాల్లో హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బస్తీలో ఏదైనా శుభకార్యం అయితే చాలు... అక్కడ వాలిపోయి అసభ్యకర మాటలు, చేష్టలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాము అడిగినంత ఇవ్వాల్సిందేనని, లేకుంటే నానా రభస చేస్తూ.. మానసికంగా ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ: పెళ్లి జరుగుతున్న ఇంటికి వెళ్లిన హిజ్రాలు అసభ్యకర చేష్టలతోపాటు దూషణలకు పాల్పడ్డ సంఘటన మధురానగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్‌లోని అమర్‌పాయింట్ లైన్‌లో ఉంటున్న ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతోంది. ఇందులో భాగంగా ఇంటి ముందు పందిరి వేశారు. పెళ్లి పందిరి గమనించిన హిజ్రాలు హీనా(21), రిషిక(19) ఇంట్లోకి వెళ్లారు. పెళ్లి కాబోయే యువతికి బొట్టుపెట్టి ఆశీర్వదించారు.
ఈ వార్తను కూడా చదవండి: TGSRTC: టార్గెట్.. టెన్షన్.. ఆర్టీసీ కండక్టర్లకు అధికారుల వేధింపులు
అంతేగాకుండా ఇంటి మందు ఓ గుర్తుపెట్టారు. బుధవారం మళ్లీ పెళ్లి ఇంటికి వెళ్లిన హిజ్రాలు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో గొడవకు దిగి అసభ్యకర చేష్టలకు పాల్పడటంతోపాటు దూషించారు. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. మధురానగర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు
కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం
High Court: ‘దోస్త్’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
Read Latest Telangana News and National News
Updated Date - May 15 , 2025 | 10:52 AM