ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: కేసుల్లో పట్టుబడ్డ వాహనాన్ని రుణ సంస్థ తీసుకోలేదు

ABN, Publish Date - Jul 15 , 2025 | 05:50 AM

అనుమతి లేని వస్తువులు, మత్తుపదార్థాలను తరలించిన కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను తమకు అప్పగించాలని రుణసంస్థలు కోరలేవని హైకోర్టు స్పష్టం చేసింది.

  • రుణం ఇచ్చినంత మాత్రానయజమాని కాలేదు: హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేని వస్తువులు, మత్తుపదార్థాలను తరలించిన కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను తమకు అప్పగించాలని రుణసంస్థలు కోరలేవని హైకోర్టు స్పష్టం చేసింది. రుణం ఇచ్చినంత మాత్రాన వాటికి యజమానులు కాలేవని తెలిపింది. ఎలాంటి పత్రాలు లేకుండా నల్లబెల్లం, పటిక తరలిస్తున్న్డ బొలేరో వాహనాన్ని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆ వాహనం తమ తాకట్టులో ఉన్నందున దానిని తమకే అప్పగించాలని కోరుతూ టైగర్‌ క్యాపిటల్‌ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ టీ వినోద్‌కుమార్‌ ధర్మాసనం.. ‘‘రుణం ఇచ్చినంత మాత్రాన యజమాని కాలేరు. ఒకవేళ వాహనం కింద పడి ఎవరైనా పడి చనిపోతే యజమానినే బాధ్యుడిగా చేస్తారు కదా! అలాంటప్పుడు వాహనం మీదెలా అవుతుంది? రుణం చెల్లించే పరిస్థితి లేకపోతే వాహన యజమాని, రుణసంస్థకు ఉన్న ఒప్పందం మేరకు వేలం వేసి రుణ మొత్తం పోను మిగతాది యజమానికి చెల్లించాలి’’ అని తెలిపింది. కేసు ముగిసిన తర్వాత వాహనాన్ని యజమానికే తప్ప రుణ సంస్థకు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

చిరంజీవి ఇంటి క్రమబద్ధీకరణ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోండి : హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.25లోని ఇంటి నిర్మాణాన్ని క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ ప్రముఖ నటుడు చిరంజీవి చేసు కున్న దరఖాస్తుపై నాలుగు వారాల్లో విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు స్పష్టంచేసింది. పిటిషనర్‌కు నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ చట్టం 1955లోని సెక్షన్‌ 455ఏఏ కింద నివాస గృహాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ గత నెల5న చేసుకున్న దరఖాస్తుపై కమిషనర్‌ ఇప్పటికీ నిర్ణయం తీసుకో లేదంటూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు 4 వారాల్లో విచారించి నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '

తిరుపతి రైల్వే‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 05:50 AM