ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rainfall: చురుగ్గా ‘నైరుతి’.. నేడు, రేపు మోస్తరు వానలు

ABN, Publish Date - May 18 , 2025 | 05:14 AM

పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

  • రాష్ట్రంలో వడదెబ్బకు ఇద్దరు.. పిడుగుపాటుకు మరో ఇద్దరి మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. మూడు రోజుల పాటు ఎండలు తక్కువే ఉంటాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని వివరించింది. కాగా, రాష్ట్రంలో వడదెబ్బకు ఇద్దరు.. పిడుగుపాటుకు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రెండు, మూడు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఎండల తీవ్రత కాస్త తగ్గింది.


శనివారం పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో అత్యధికంగా 41.7 డిగ్రీలు నమోదైంది. నల్లగొండ జిల్లా డిండి మండలం సింగరాజుపల్లిలో పంచాయతీ పారిశుధ్య కార్మికుడు పొనుగోటి రామేశ్వర్‌రావు (60), ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామచంద్రపురంలో తొర్లపాటి దాసు (80) వడదెబ్బకు అస్వస్థత చెంది మృతి చెందారు. కాగా, మంచిర్యాల జిల్లా నెన్నెలలో అత్యధికంగా 6.9, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పిడుగుపాటుకు గురై మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పరిధిలోని పడాలపల్లికి చెందిన పంబాల ప్రసాద్‌ (15), నడిపల్లి యశ్వంత్‌ (13) మృతి చెందారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 05:14 AM