Harish Rao: డిగ్రీ పరీక్షలు చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థత
ABN, Publish Date - May 05 , 2025 | 04:48 AM
రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో ఏప్రిల్‌లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను నేటికీ చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
రేవంత్‌వి గాలి మాటలు: హరీశ్‌రావు
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో ఏప్రిల్‌లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను నేటికీ చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ.800 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించరా? అని ఆదివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ పథకాన్ని మరుగునపడేలా చేసిందన్నారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని అసెంబ్లీలో చెప్పిన మాటలు గాలి మాటలయ్యాయని విమర్శించారు. రెండు నెలల్లో మొత్తం బకాయిలు చెల్లిస్తామని, కళాశాల యాజమాన్యాలకు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటిమూటగా మారిందన్నారు. పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. సకాలంలో పరీక్ష నిర్వహించక పోవడంతో పీజీసెట్, లాసెట్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి మూడో సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..
Updated Date - May 05 , 2025 | 04:48 AM