ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Commissioner: సీజనల్‌ వ్యాధులొస్తాయి.. జాగ్రత్త

ABN, Publish Date - Jun 18 , 2025 | 10:08 AM

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్‌ జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఅండ్‌హెచ్‌ఓలు, ఎంటమాలజీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

- సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

- గ్రేటర్‌ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌

హైదరాబాద్‌ సిటీ: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌(GHMC Commissioner RV Karnan) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్‌ జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఅండ్‌హెచ్‌ఓలు, ఎంటమాలజీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శానిటేషన్‌ నిర్వహణ, దోమల నివారణ, ఆస్తిపన్ను వసూళ్లపై వారితో సమీక్ష నిర్వహించారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ దోమల నివారణకు చేస్తున్న ఫాగింగ్‌పై అసిస్టెంట్‌ మెడికల్‌ అధికారిదే పూర్తి బాధ్యత ఉంటుందన్నారు.

సాయంత్రం 4 నుంచి 10 గంటల వరకు ఫాగింగ్‌ తప్పనిసరిగా చేయాలని అన్నారు. ఏఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో యాంటీ లార్వా పనులు చేపట్టాలన్నారు. డెంగీ వ్యాధి ప్రబలిన జాబితాను బస్తీ దవాఖానా, పీహెచ్‌సీల నుంచి సేకరించాలని, బాధితుల ఇంటినుంచి ఎస్‌ఓపీ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. ఫాగింగ్‌ షెడ్యూల్డ్‌ సంబంధిత కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. కాగా, బిల్లు కలెక్టర్‌కు ఇచ్చిన టార్గెట్‌ మేరకు ఆస్తిపన్ను వసూలు చేయాల్సిందేనన్నారు. బేగంపేట్‌, సరూర్‌నగర్‌(Begumpet, Saroornagar)లలో చెక్‌ బౌన్స్‌లు ఎక్కువ వచ్చినందున వాటిని వెంటనే క్లియర్‌ చేయాలని సంబంధిత డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.

కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని, స్టెరిలైజేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిబంధనలు పాటించాలని ఆదేశించారు. హోటళ్లలో ఫుడ్‌పాయిజన్‌ కాకుండా మటన్‌, చికెన్‌ దుకాణాలను ఫుడ్‌సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీ చేయాలని చీఫ్‌ వెటర్నరీ అధికారిని ఆదేశించారు. సమీక్షలో అడిషనల్‌ కమిషనర్లు రఘుప్రసాద్‌, పంకజ, జోనల్‌ కమిషనర్లు హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, అపూర్వచౌహాన్‌, హేమంత్‌ సహదేవ్‌రావు, రవికిరణ్‌, వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ మెడికల్‌ అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

ఇంజనీరింగ్‌లో మళ్లీ ‘నచ్చిన సబ్జెక్టులు’!

సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 18 , 2025 | 10:59 AM