ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KIMS hospital: మెదడు చికిత్సల్లో సరికొత్త విప్లవం

ABN, Publish Date - May 16 , 2025 | 03:53 AM

మెదడులో ఏర్పడే క్యాన్సర్‌ కణితులకు శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేసే గామా నైప్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి గామా నైఫ్‌ సెంటర్‌ను గురువారం కిమ్స్‌ ఆస్పత్రిలో ప్రారంభించారు.

  • మెదడు క్యాన్సర్‌ కణితులకు గామానై్‌ఫతో చెక్‌

  • సర్జరీ లేకుండానే వైద్య ప్రక్రియ.. కిమ్స్‌ ఆస్పత్రిలో ప్రారంభం

  • సీఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, మే 15(ఆంధ్రజ్యోతి): మెదడులో ఏర్పడే క్యాన్సర్‌ కణితులకు శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేసే గామా నైప్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి గామా నైఫ్‌ సెంటర్‌ను గురువారం కిమ్స్‌ ఆస్పత్రిలో ప్రారంభించారు. శస్త్రచికిత్స అవసరాన్ని దాదాపుగా తప్పించడంతో పాటు వేగంగా కోలుకునే పద్ధతిని రోగులకు అందిస్తున్నామని కిమ్స్‌ సీఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. ఈ ప్రక్రియలో మిల్లీ మీటర్లు, అంతకంటే తక్కువ ప్రదేశాన్ని కూడా గుర్తించి, మెదడులోపల ఉన్న భాగాలకు చికిత్స చేసేందుకు రేడియేషన్‌ కిరణాలను ఇందులో పంపుతారని సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ మానస్‌ పాణిగ్రాహి వివరించారు.


ఇందులో అసలు రక్తం కారదని, నొప్పి కూడా ఉండదన్నారు. వయసు, ఆరోగ్యం కారణంగాను, కణితి ఉన్న ప్రదేశం వల్ల శస్త్రచికిత్స చేయలేనివారికి ఇది మరింత ప్రయోజనకరమని న్యూరో ఆంకాలజీ, న్యూరోసర్జరీ కేసుల్లో గామా నైఫ్‌ కీలమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. 30 నిమిషాల నుంచి 2 గంటల లోపల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. చికిత్స అనంతరం 24 నుంచి 48 గంటల్లోనే 90 శాతం రోగులు తమ పనులు చేసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు దీరేంద్ర ప్రసాద్‌, చంద్రశేఖర్‌ నాయుడు, సంబిత్‌ శేషు, జోసఫ్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 03:53 AM