ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Road accident: కారు, డీసీఎం ఢీ.. తండ్రి, కూతురు మృతి

ABN, Publish Date - May 12 , 2025 | 05:20 AM

నిర్మల్‌ జిల్లా నీలాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు.. ముందు ఉన్న డీసీఎం ను ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న తండ్రి, అతని కుమార్తె మరణించారు.

  • నిర్మల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిర్మల్‌ రూరల్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా నీలాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు.. ముందు ఉన్న డీసీఎం ను ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న తండ్రి, అతని కుమార్తె మరణించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్‌కు చెందిన బండి అశోక్‌(49) అతని కుమార్తె కృతిక(21) ప్రాణా లు కోల్పోయారు. ఆదిలాబాద్‌, రవీంద్రనగర్‌ కాలనీకి చెందిన బండి అశోక్‌(49) బ్యాటరీ వ్యాపారం చేస్తుంటారు. ఆయన కుమార్తె కృతిక హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతుంది.


కృతికను ఇంటికి తీసుకురావడానికి డ్రైవర్‌తో కలిసి అశోక్‌ హైదరాబాద్‌ వెళ్లి.. కుమార్తెతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో నిద్ర వస్తుందని చెప్పడంతో డ్రైవర్‌ను కారు వెనుక సీటులోకి పంపిన అశోక్‌ కాసేపు స్వయంగా వాహనాన్ని నడిపారు. నీలాయిపేట సమీపంలో యూటర్న్‌ వద్ద మలుపు తీసుకుంటున్న డీసీఎంను వేగంగా వస్తున్న వీరి కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ముందుసీట్లలో ఉన్న అశోక్‌, కృతిక మరణించారు. కారు డ్రైవర్‌, డీసీఎం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టామని రూరల్‌ ఎస్సై లింబాద్రి తెలిపారు.


ఇవి కూడా చదవండి

Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2025 | 05:20 AM