ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Double-decker flyover: సికింద్రాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌కు ముందడుగు..

ABN, Publish Date - Mar 14 , 2025 | 10:15 AM

సికింద్రాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ముందడుగు పడింది. నేషనల్‌ హైవే-44లోని మిలిటరీ డెయిరీఫాం వరకు 5.32 కిలోమీటర్ల మేర డబుల్‌డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రూ. 652 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. దీంతో త్వరలోను నగరంలో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రారంభం కానుంది.

- ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి మిలిటరీ డెయిరీ ఫాం వరకు..

- టెండర్లను ఆహ్వానించిన హెచ్‌ఎండీఏ

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ జంక్షన్‌(Secunderabad Paradise Junction) నుంచి నేషనల్‌ హైవే-44లోని మిలిటరీ డెయిరీఫాం వరకు 5.32 కిలోమీటర్ల మేర డబుల్‌డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రూ. 652 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించేందుకు గతేడాది సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకు 18.124 కిలోమీటర్ల మేర, ప్యారడైజ్‌ నుంచి నేషనల్‌ హైవే-44లోని మిలిటరీ డెయిరీఫాం వరకు 5.32 కిలోమీటర్ల మేర మరో డబుల్‌డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మన హైదరాబాద్ బాగా డవలప్ అయింది బాస్.. ఏం జరిగిందంటే..


ఇటీవల రక్షణ శాఖ నుంచి భూములకు సంబంధించి క్లియరెన్స్‌ వచ్చింది. దాంతో పాటు డెయిరీఫాం వరకు డబుల్‌డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌లో బేగంపేట వద్ద విమానాశ్రయ ప్రాంగణంలో 0.6 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌ నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అనుమతులు ఇచ్చింది. దీంతో హైదరాబాద్‌ నాగపూర్‌ మార్గంలోని ఎన్‌హెచ్‌-44లో సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి తాడ్‌బండ్‌- బోయిన్‌పల్లి జంక్షన్‌(Tadbund-Boinpally Junction)ల మీదుగా మిలటరీ డెయిరీ ఫామ్‌ రోడ్డు వరకు రూ.1,580 కోట్లతో ఎలివేటెట్‌ కారిడార్‌ నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది.


ఇందులో సగానికి పైగా నిధులను భూసేకరణకు వ్యయం చేయమన్నారు. రూ. 652 కోట్లను మాత్రమే సివిల్‌ పనులకు వినియోగించనున్నారు. ఎలివేటెడ్‌ కారిడార్‌లో భవిష్యత్తులో మెట్రో రైలు మార్గాన్ని డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌గా నిర్మించనున్నారు. ఆరు లేన్ల కారిడార్‌లో 131 పిల్లర్లు ఉంటాయి. ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు, బోయిన్‌పల్లి జంక్షన్‌కు సమీపంలో నిర్మాణానికి ఇరువైపులా 2 ర్యాంపులు కూడా నిర్మించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

దేశ విభజనకు కాంగ్రెస్‌ కుట్ర

ఎండిన పంట.. రైతు గుండె మంట

జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 14 , 2025 | 10:22 AM