Congress: టీపీసీసీ కార్యవర్గంలో బహుజనులకు పెద్దపీట!
ABN, Publish Date - May 16 , 2025 | 03:31 AM
టీపీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటు, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశాల్లో కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చినట్టు తెలిసింది.
నెలాఖరుకు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై స్పష్టత
న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 15(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటు, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశాల్లో కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చినట్టు తెలిసింది. ఆ పార్టీకి చెందిన అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఏ క్షణంలోనైనా టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉంది. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు, 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులు, 10 మంది సీనియర్లతో సలహా కమిటీ, 20 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ.. మొత్తంగా టీపీసీసీ జంబో కార్యవర్గం ఏర్పడనుంది. ఇందులో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే దక్కనున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇందుకు సంబంధించిన తుది కసరత్తును పూర్తి చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, పార్టీలోని సీనియర్ల కోసం ఈ సారి కొత్తగా సలహాదారుల కమిటీని నియమిస్తున్నారు. మరోపక్క, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఈ నెలాఖరుకు స్పష్టత రానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
సునీతారావుపై పార్టీ నాయకత్వం సీరియస్
పార్టీ కోసం పని చేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదంటూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నిరసన వ్యక్తం చేయడాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో పార్టీ క్రమశిక్షణ చర్యల కమిటీ భేటీ కానుందని.. పార్టీ నాయకత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి షోకాజ్ నోటీసు జారీ చేయనుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News
Updated Date - May 16 , 2025 | 03:31 AM