ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: దక్షిణాది రాష్ట్రాలకు 33% సీట్లివ్వాలి!

ABN, Publish Date - May 10 , 2025 | 03:53 AM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు తాము వ్యతిరేకం కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ, దక్షిణాది రాష్ట్రాలకు తప్పనిసరిగా 33 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

  • నియోజకవర్గాల పునర్విభజన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాల్ని శిక్షించేలా ఉండొద్దు

  • జనాభా ప్రాతిపదికన పునర్విభజనతో మా రాష్ట్రాలకు తీరని అన్యాయం

  • అందరితో చర్చించాకే ముందుకు వెళ్లాలి

  • తెలంగాణ నమూనాను కేంద్రమూ అనుసరించాల్సిన పరిస్థితి

  • మా విధానాలు దేశానికే ఆదర్శం

  • ‘ది హిందూ హడిల్‌ 2025’లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు తాము వ్యతిరేకం కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ, దక్షిణాది రాష్ట్రాలకు తప్పనిసరిగా 33 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు జనాభా ప్రాతిపదికన పునర్విభజన ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసిన రాష్ట్రాలను శిక్షించేలా పునర్విభజన ప్రక్రియ ఉండకూడదని చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపడితే దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య అంతరం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సామాజిక, రాజకీయ న్యాయానికి సంబంధించిన అంశమని, అందుకే దీనిపై విస్తృత చర్చ జరగాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి, పునర్విభజన ప్రక్రియకు ప్రాతిపదికను ఖరారు చేయాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నదే తమ డిమాండ్‌ అన్నారు. బెంగళూరులో శుక్రవారం హిందూ పత్రిక నిర్వహించిన ‘ది హిందూ హడిల్‌-2025’ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి జూమ్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. విభజన ప్రక్రియ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను శిక్షించేలా ఉండకూడదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి పన్నుల రూపంలో పెద్దమొత్తంలో సొమ్ము అందజేస్తుండగా.. తిరిగి వచ్చేది మాత్రం బీమారు రాష్ట్రాల కంటే అతి తక్కువగా ఉంటోందని ఆరోపించారు. అందుకే తమ రాష్ట్రాలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


తెలంగాణ విధానాలు దేశానికే ఆదర్శం..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని సీఎం రేవంత్‌ చెప్పారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ నమూనాను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య ఉద్యోగ, రాజకీయ సర్వే దేశానికే మోడల్‌గా నిలిచిందని చెప్పారు. ఈ సర్వే కేవలం బీసీల కోసమే చేసింది కాదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకూ ఉపయోగపడుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ముందడుగు వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ నమూనాను అమలు చేయాలని చెప్పారు. తెలంగాణలోని వేర్వేరు గురుకుల పాఠశాలల్లో ప్రత్యేకంగా సాగుతున్న విద్యను సమీకృతం చేయడం ద్వారా పిల్లల్లో సామాజిక స్పృహ, ఐకమత్యం పెంపొందించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమన్నారు. భారత సైన్యానికి వందనాలు సెల్యూట్‌ చెబుతూ సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘మొదటగా నేను భారతీయ సైన్యానికి సెల్యూట్‌ చేస్తున్నా. దేశాన్ని రక్షించడంలో అహర్నిశలు కృషి చేస్తున్న సైన్యానికి మనమంతా మద్దతు తెలపాలి’’ అని పిలుపునిచ్చారు.


అగ్రగామి నగరాలతో పోటీ

ప్రపంచంలోని అగ్రగామి నగరాలతో పోటీ పడాలన్నదే తమ ఆలోచనని, అందులో భాగంగానే నెట్‌ జీరో సిటీకి ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యూచర్‌ సిటీకి రూపకల్పన చేశామన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను రద్దు చేశామని చెప్పారు. హైదరాబాద్‌ వెలుపల 360 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌ రోడ్డును నిర్మించడమే కాకుండా తెలంగాణలో ప్రాంతాల వారీగా పారిశ్రామికీకరణకు సన్నద్ధమయ్యామని వివరించారు. డ్రైపోర్టు నిర్మాణం వంటి అనేక ప్రణాళికలకు రూపకల్పన చేశామన్నారు. రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించామని చెప్పారు. ఇటీవల జపాన్‌ పర్యటన సందర్భంగా తెలుసుకున్న విషయాల మేరకు ఆ దేశానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చడానికి వీలుగా తెలంగాణలో జపనీస్‌ భాషను నేర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘‘జనాభాలో దాదాపు 60ు ఉన్న వ్యవసాయ కుటుంబాలకు అండగా ఉండేందుకు అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 25 లక్షలకు పైగా రైతులకు రూ.21,617 కోట్ల రుణమాఫీ చేశాం. ఏటా రూ.12 వేలు పెట్టుబడి రాయితీగా ఇస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేసే అవకాశం, పాఠశాలల నిర్వహణ, యూనిఫామ్‌ కుట్టడం వంటి బాధ్యతలు అప్పగించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం’’ అని వివరించారు. అన్ని కోణాల్లోనూ తెలంగాణ రైజింగ్‌ మొదలైందన్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 03:53 AM