CM Revanth Reddy: నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త పడాలి
ABN, Publish Date - May 08 , 2025 | 04:50 AM
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు ఏర్పడిన ఈ తరుణంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.
అధికారులతో రేవంత్, భట్టి సమీక్ష
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు ఏర్పడిన ఈ తరుణంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై వారిద్దరూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని, హైదరాబాద్ నగరంలోని విదేశీ రాయబార కార్యాలయాల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని నిర్దేశించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని, కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షించాలని నిర్దేశించారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయపడొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 04:50 AM