ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

HCA President: ఫోర్జరీతో ప్రవేశం

ABN, Publish Date - Jul 11 , 2025 | 05:14 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియే్‌ష(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్‌రావు లీలలు సీఐడీ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

  • ఆఫీసు బేరర్లతో కలిసి హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం

  • సీఐడీ విచారణలో బయటపడిన అధ్యక్షుడు జగన్మోహన్‌ లీలలు

  • ఆయనతో సహా ఐదుగురిని రిమాండ్‌కు తరలించిన సీఐడీ

  • బీసీసీఐకి చెందిన రూ.170 కోట్ల నిధుల దుర్వినియోగం

  • టెండర్లలో నిబంధనలకు తూట్లు.. క్రీడా సామగ్రి కొనుగోళ్లలో అవినీతి

  • రిమాండ్‌ రిపోర్టులో సీఐడీ.. చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే వినోద్‌

హైదరాబాద్‌, అడ్డగుట్ట, కుషాయిగూడ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియే్‌ష(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్‌రావు లీలలు సీఐడీ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫోర్జరీ పత్రాల సాయంతో జగన్మోహన్‌ హెచ్‌సీఏలోకి ప్రవేశించారని, అధ్యక్షుడైన తర్వాత ఆఫీస్‌ బేరర్లతో కలిసి సంస్థ నిధుల దుర్వినియోగం చేశారని సీఐడీ విచారణలో వెల్లడైంది. హెచ్‌సీఏలో ఆర్థిక అవకతవకలు, ఫోర్జరీ వివిధ ఆరోపణలపై తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గురవా రెడ్డి గత నెలలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సీఐడీ చర్యలు తీసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్‌, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ యాదవ్‌, ఆయన భార్య కవితను బుధవారం అదుపులోకి తీసుకుంది. సీఐడీ అదనపు డీజీ చారు సిన్హా కథనం ప్రకారం.. శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ (గౌలిపురా క్రికెట్‌ క్లబ్‌) ఒకప్పటి అధ్యక్షుడైన కృష్ణయాదవ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి సృష్టించిన పత్రంతో జగన్మోహన్‌ హెచ్‌సీఏలోకి ప్రవేశించారు. కృష్ణయాదవ్‌ సంతకం ఫోర్జరీ చేయడానికి శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ ప్రస్తుత అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త, క్లబ్‌ కార్యదర్శి, కృష్ణయాదవ్‌ సోదరుడైన రాజేందర్‌ యాదవ్‌ సహకరించారు. ఫోర్జరీ పత్రం ఆధారంగా హెచ్‌సీఏలోకి ప్రవేశించిన జగన్మోహన్‌రావు, ఆ తర్వాత అధ్యక్షుడు అయ్యారు. జగన్మోహన్‌రావు హెచ్‌సీఏ అధ్యక్షుడైన తర్వాత అక్కడి ఆఫీసు బేరర్లు అయిన కోశాధికారి జేఏస్‌ శ్రీనివాసరావు, సీఈవో సునీల్‌ కాంటేతో కలిసి హెచ్‌సీఏ నిధులను దుర్వినియోగం చేశారు. అంతేకాక, వీరంతా కలిసి కాంప్లిమెంటరీ టికెట్ల కోసం సన్‌రైజర్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీని బెదిరింపులకు గురి చేశారు. ఉప్పల్‌ స్టేడియంలోని వీఐపీ బాక్స్‌కు తాళం వేసి ఆ ఫ్రాంచైజీని బ్లాక్‌మెయిల్‌ చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు గురువారం రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు నిందితులందరికీ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కుషాయిగూడలోని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కాగా, ఫోర్జరీ డాక్యుమెంట్‌ సాయంతో జగన్మోహన్‌రావు హెచ్‌సీఏ అధ్యక్షుడు అయ్యారని సీఐడీ విచారణలో తేలిన నేపథ్యంలో.. ఆయన ఎన్నిక ప్రశ్నార్థకం అయింది.

హెచ్‌సీఏలోకి అక్రమంగా ప్రవేశించిన జగన్మోహన్‌రావు నిబంధనలకు విరుద్ధంగా పలు టెండర్లను తమకు అనుకూలమైన వారికి ఇవ్వడం ద్వారా కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని రిమాండ్‌ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. బీసీసీఐకు సంబంధించిన రూ.170 కోట్ల నిధులు ఖర్చు చేశారని, ఇందులో చాలావరకు నిధుల దుర్వినియోగం అయ్యాయని వెల్లడించారు. 2023-24లో జరిగిన 17,18 ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన టెండర్లలో అక్రమాలు జరిగాయన్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్‌రావు టెండర్ల నిబంధనలు పాటించలేదని, ఇతనికి సీఈఓ, కోశాధికారి సహకరించారని వివరించారు. క్రీడా పరికరాలకు సంబంధించిన నివేదికలను కూడా హెచ్‌సీఏ పెద్దలు మార్చేశారని రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కోన్నారు. కాగా, అవినీతికి పాల్పడిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, ఇతర సభ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 05:14 AM