Share News

Modi Govt: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:01 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 30 నుంచి 34 శాతం మేర ఉద్యోగుల జీతాలు పెంచాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Modi Govt: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
Central Govt Employees

న్యూఢిల్లీ, జులై 10: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా ఉద్యోగుల జీతాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక చర్చ సాగుతోంది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30‌ నుంచి 34 శాతం జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని వేతన సంఘం ఈ మేరకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెంచిన జీతాలు 2026 జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.


ఈ 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం వేతనాలు పెంచినట్లయితే.. దాదాపు 11 మిలియన్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని కేంద్రం నియమిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో మోదీ సర్కార్ 7వ వేతన సంఘాన్ని నియమించింది. అప్పుడు అత్యల్పంగా 14 శాతం మేర జీతాలను పెంచారు. మళ్లీ ఈ ఏడాది 8వ వేతన సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సంఘం సిఫారసు మేరకు ఉద్యోగుల వేతనాలను పెంచనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అధిష్టానానికి భార్య, కుమార్తె ఫిర్యాదు

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2025 | 04:09 PM