Share News

Congress MLA: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అధిష్టానానికి భార్య, కుమార్తె ఫిర్యాదు

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:53 PM

చన్నపట్టణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్‌కు వ్యతిరేకంగా భార్య, కుమార్తెలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలాను వారు భేటీ అయ్యారు.

Congress MLA: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అధిష్టానానికి భార్య, కుమార్తె ఫిర్యాదు

బెంగళూరు: చన్నపట్టణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్‌(Congress MLA CP Yogeshwar)కు వ్యతిరేకంగా భార్య, కుమార్తెలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలాను వారు భేటీ అయ్యారు. యోగేశ్వర భార్య మాళవిక సూలంకి, కుమార్తె నిశాలు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబాన్ని తరచూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.


పదే పదే కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. చట్టపరంగా తాము దూరం కాలేదని, అయినా మానసికంగా హింసిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే చాలంటూ విన్నవించారు. సీపీ యోగేశ్వర్‌ బీజేపీలో కొనసాగుతున్నప్పుడే కుమార్తె నిశా కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్‌(DK Shivakumar)ను భేటీ అయిన విషయం తెలిసిందే.


pandu4.gif

అప్పట్లోనే నిశా కాంగ్రెస్ లో చేరే ప్రయత్నం చేశారు. అందుకు డీకే శివకుమార్‌ స్పందించి తండ్రికి వ్యతిరేకంగా పోరాటం సరికాదని, పెళ్లి కావాల్సి ఉందని మందలించారు. యోగేశ్వర్‌ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ నుంచి చన్నపట్టణ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2025 | 01:53 PM