Maheshwar Reddy: దాన్యం తరుగుతో రూ.2,860 కోట్ల దోపిడీ: ఏలేటి
ABN, Publish Date - May 16 , 2025 | 03:39 AM
మిల్లర్ల దోపిడీ ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా. లేక ప్రభుత్వం కళ్లు గప్పి ఈ తతంగం నడుస్తుందా. అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): ‘మిల్లర్ల దోపిడీ ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా..? లేక ప్రభుత్వం కళ్లు గప్పి ఈ తతంగం నడుస్తుందా..?’’ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. చాలా చోట్ల మిల్లర్లు అధిక తరుగుతో ధాన్యం తీసుకుంటూ రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 40 కిలోల బస్తాలో 4 కిలోలు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. 13 లక్షల టన్నుల ధాన్యానికి రూ.2,860 కోట్ల ముడుపులు కూడగట్టారని, రెండు సీజన్లలో రూ.6వేల కోట్ల మోసం జరిగిందని విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలు, వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం, గన్నీబాగులు, టార్పాలిన్ లేని పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్నదాతలకు ఇవ్వాల్సిన రూ.760కోట్ల బోనస్ ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్లు తప్పుకున్నా, వారిపై కేసులు పెట్టని అంశాన్ని ప్రస్తావించారు. ఈ తతంగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News
Updated Date - May 16 , 2025 | 03:39 AM