ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BC Reservation: బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి

ABN, Publish Date - May 06 , 2025 | 06:11 AM

కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపేలా గవర్నర్‌ విశిష్ట అధికారాలను ఉపయోగించాలని బీసీ సంఘాల నేతలు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కోరారు.

  • గవర్నర్‌కు బీసీ సంఘాల నేతల విజ్ఞప్తి

హైదరాబాద్‌, పంజాగుట్ట, మే 5 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపేలా గవర్నర్‌ విశిష్ట అధికారాలను ఉపయోగించాలని బీసీ సంఘాల నేతలు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కోరారు. బీసీ సంఘాల ప్రతినిధుల బృందం సోమవారం గవర్నర్‌తో భేటీ అయ్యారు. దేశంలో సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా సహకరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.


అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని వెల్లడించడం బీసీల పోరాట విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన 42 శాతం బీసీ బిల్లును కేంద్రం ఆమోదించి తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట రూపంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లు పెంచేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. బీసీ సంఘాల నాయకులు కుందారం గణేష్‌ చారి, కుల్కచర్ల శ్రీనివాస్‌ ముదిరాజ్‌, తాటికొండ విక్రమ్‌ గౌడ్‌, కనకాల శ్యాం కురుమ, మని మంజరి సాగర్‌, చంద్రశేఖర్‌ గౌడ్‌ తదితరులు గవర్నర్‌ను కలిశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 06:11 AM