Mobile Charging: మీ ఫోన్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? ఈ టిప్స్ పాటించండి..!
ABN, Publish Date - Dec 19 , 2025 | 10:00 PM
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? మీ ఫోన్‌లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటం లేదా? వెంట వెంటనే ఛార్జింగ్ దిగిపోవడంతో చిరాకు పడుతున్నారా? అయితే, అదిరిపోయే టిప్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి మీ ఫోన్‌లో ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
ఇంటర్నెట్ డెస్క్: మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? మీ ఫోన్‌లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటం లేదా? వెంట వెంటనే ఛార్జింగ్ దిగిపోవడంతో చిరాకు పడుతున్నారా? అయితే, అదిరిపోయే టిప్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి మీ ఫోన్‌లో ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
ఎంత ఖరీదైన ఫోన్ కొన్నా.. దాని బ్యాటరీ లైఫ్ బాగుంటేనే మన దానిని ఆస్వాదించగలం. అలా కాకుండా.. వెంట వెంటనే ఛార్జింగ్ దిగిపోతే.. చాలా చిరాకు వస్తుంది. అయితే, కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరగా ఛార్జింగ్ అయిపోతుంటుంది. ఎక్కువ ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు, సినిమాలు చూసినప్పుడు, మ్యూజిక్ వినడం, ఇతర పనులు చేయడం వలన ఫోన్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుంటుంది. కొన్నిసార్లు బ్యాక్‌గ్రౌండ్ డేటా యూజింగ్ వలన కూడా బ్యాటరీ డౌన్ అవుతుంది. ఇక ఛార్జింగ్ త్వరగా దిగిపోతే.. ఫోన్ కూడా బాగా వేడెక్కుతుంటుంది. అయితే, మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా దిగిపోవద్దంటే కొన్ని సెట్టింగ్స్, టిప్స్ తెలుసుకోవాలందే. అవేంటంటే..
టర్న్ ఆఫ్ - ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే..
డిస్‌ప్లే ఎప్పుడూ ఆన్‌లో ఉండకుండా చూసుకోవాలి. ఫోన్ డిస్‌ప్లే ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటే బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. అందుకనే.. మీ ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి.. డిస్‌ప్లే సెట్టింగ్‌లోకి వెళ్లాలి. ఆ తరువాత లాక్ స్క్రీన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఆల్వేస్ షో ఇన్‌ఫో ఆప్షన్ గానీ, ఎనబుల్ ఆల్వేస్ డిస్‌ప్లే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ఫోన్ ఛార్జింగ్ దాదాపుగా ఆదా అవుతుంది.
అడాప్టివ్ బ్యాటరీని ఆన్ చేయాలి..
ఆండ్రాయిడ్ ఫోన్లలో అడాప్టివ్ బ్యాటరీ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగడంతో పాటు.. ఫోన్ పనితీరు కూడా మెరుగవుతుంది. ఈ ఆప్షన్ కోసం మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. బ్యాటరీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అడాప్టివ్ బ్యాటరీ ప్రిఫరెన్స్‌లకు వెళ్లాలి. అడాప్టివ్ బ్యాటరీ ఎనబుల్ చేయాలి. ఒకవేళ ఎనబుల్ లేకపోతే ఆన్ చేయండి.
యాక్టీవ్ బ్యాటరీ సేవర్..
అడాప్టివ్ బ్యాటరీతో పాటు, బ్యాటరీ సేవర్ మోడ్ కూడా మీ ఫోన్‌లో ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేందుకు దోహదపడుతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌లను పరిమితం చేయడం, పలు యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో ఛార్జింగ్ ఉపయోగించకుండా నిరోధిస్తుంది. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ ఆప్షన్‌ను ఆన్ చేయకపోతే.. బ్యాటరీ సేవ్ మోడ్ చేయండి. ఇది ఆన్ చేస్తే.. మీ ఫోన్ డార్క్ మోడ్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. తద్వారా ఛార్జింగ్ కూడా ఎక్కువ సమయం వస్తుంది. ఈ సెట్టింగ్స్ దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటాయి.
Also Read:
మీ ట్యాలెంట్‌కు ఛాలెంజ్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 50 సెకెన్లలో కనిపెట్టండి
ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని.. దారుణం..
Updated Date - Dec 19 , 2025 | 10:01 PM