Road Accident in Visakhapatnam: ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని.. దారుణం..
ABN , Publish Date - Dec 19 , 2025 | 09:40 PM
విశాఖలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెందుర్తి సింహపురి కాలనీ బీఆర్టీఎస్ రోడ్డులో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనంపై భార్య, కుమారుడితో వెళ్తున్న ఓ వ్యక్తి.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను బలంగా ఢీకొట్టాడు.
విశాఖ: జిల్లాలో ఘోర ప్రమాదం(Vizag Road Accident) చోటు చేసుకుంది. పెందుర్తి(Pendurthi) సింహపురి కాలనీ బీఆర్టీఎస్ రోడ్డు(Simhapuri Colony BRTS Road)లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనంపై భార్య, కుమారుడితో వెళ్తున్న ఓ వ్యక్తి.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డివైడర్‌పై పడి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
తీవ్రంగా గాయపడిన మహిళ, ఆరు సంవత్సరాల బాలుడిని కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు బాధితుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో రోడ్డుప్రమాదాల్లో పదుల కొద్దీ ప్రాణాలు పోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Guntur Digital Arrest Scam: డిజిటల్ అరెస్టు పేరుతో హెడ్ మాస్టర్‌కే టోకరా..