Chandrababu Naidu Meets Amit Shah: అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
ABN , Publish Date - Dec 19 , 2025 | 09:34 PM
సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఆయనకు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు.. సీఎం చంద్రబాబును ఘనంగా సత్కరించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు న్యూఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. శుక్రవారం రాత్రి కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు బేటీ అయ్యారు. తాజ్ ప్యాలెస్ హోటల్‌లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఈ సందర్భంగా అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించారు. ఇటీవల విశాఖపట్నం వేదికగా నిర్వహించిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు పెద్ద ఎత్తున సానుకూల స్పందన వచ్చిందని అమిత్ షాకు సీఎం వివరించారు. అలాగే రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై సైతం వీరు ప్రస్తావించినట్లు సమాచారం. అనంతరం క్రెడాయ్ నేషనల్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఆయనకు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు.. సీఎం చంద్రబాబును ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలవుతూ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు ఎంపీలు ఆయన వెంట ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమరావతిలో భారీ పెట్టుబడులు.. ముందుకొచ్చిన మలేసియా కంపెనీలు
For More AP News And Telugu News