Railway Announces Special Trains: ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 19 , 2025 | 09:08 PM
ప్రతియేడు రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. వీళ్లను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 244 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది.
పండగ సీజన్ వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతి పండగలకు స్కూళ్ల సెలవులు ఇప్పటికే ప్రకటించేశారు. దాంతో పిల్లాపాపలతో కలిసి పలు కుటుంబాలు టూర్‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి. దీంతో ఇప్పటికే సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లోని రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ రైల్వే జోన్లలో ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది.
అయినా ప్రతియేడు రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. వీళ్లను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 244 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను నడిపే అవకాశం ఉందంటూ రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
దేశవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న ప్రధాన మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ తెలిపింది. ఉదాహరణకు.. ముంబై - గోవా (కొంకణ్) కారిడార్‌లో.. ప్రతి రోజు, అలాగే వారంలో ఒకసారి ముంబై CSMT/LTT, కర్మాలి/ మడ్గావ్ మధ్య నడుస్తాయి. ఈ రైళ్లు కీలక స్టేషన్లలో ఆగుతాయి. ముంబై - నాగ్‌పూర్, పూణే - సంగానేర్ తదితర మార్గాల్లో అదనపు రైళ్లను నడుపుతోంది.
అన్ని మార్గాల్లో రైళ్లు..
ఢిల్లీ, హౌరా, లక్నో తదితర నగరాలను అనుసంధానించేలా ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు, ఇతర నగరాల మధ్య అదనపు రైళ్లు నడవనున్నాయి. CSMT - కర్మాలి, LTT - తిరువనంతపురం, పూణే - సంగనేర్, CSMT- నాగ్‌పూర్ తదితర మార్గాల మధ్య రైళ్లు నడుస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిలో సీట్లు సైతం ఫుల్ అయిపోయాయి.
ముందుగానే టికెట్ బుక్..
పండగ సీజన్ నేపథ్యంలో పలు మార్గాల్లో వేళ్లే రైళ్లలోని సీట్లు త్వరగా నిండిపోతాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఐఆర్‌సీటీసీ లేదా అధీకృత కౌంటర్ల ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసుకోవాలి.
స్టేషన్‌కు ముందుగానే చేరుకోవాలి..
పండగ రద్దీ కారణంగా.. ఎంట్రీ పాయింట్లు, భద్రతా తనిఖీల వద్ద ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 30 నుంచి 45 నిమిషాల ముందుగా రైల్వే స్టేషన్‌కు చేరుకునేలా ముందస్తు ప్రణాళికను సిద్దం చేసుకోవాలి.
ఈ జాగ్రత్తలు పాటించండి..
పంగడ వేళ అంటేనే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మాస్క్ కంపల్సరీ పెట్టుకొవాలి. వాటర్ బాటిల్, జలుబు, దగ్గుకు సంబంధించిన ట్యాబ్లెట్లు, కాఫ్ సిరప్ వంటివి ప్రయాణంలో మనతో ఉంచుకోవాలి. సెల్ ఛార్జర్లు సైతం వెంట ఉంచుకోవాలి. అలాగే డిజిటల్ సేవలు ఉపయోగించుకుంటే.. త్వరితగతిన గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశాం ఉంటుంది.