Amaravati: అమరావతిలో భారీ పెట్టుబడులు.. ముందుకొచ్చిన మలేషియా కంపెనీలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 09:48 PM
తాజాగా అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రజా రాజధానిలో పర్యటించేందుకు మలేషియా బృందం శుక్రవారం అమరావతికి చేరుకుంది.
అమరావతి, డిసెంబర్ 19: రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రజా రాజధానిలో పర్యటించేందుకు మలేషియా బృందం శుక్రవారం అమరావతికి చేరుకుంది. ఈ ప్రతినిధులతో ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. రాజధాని నిర్మాణ పురోగతిని ఈ సందర్భంగా వారికి వివరించింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మలేషియా బృందంలోని సభ్యులు స్పష్టం చేశారు.
ఇక రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను వివరించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రతినిధి బృందాలు ఇప్పటికే పలు దేశాలు పర్యటించారు. నవంబర్ రెండో వారం చివర్లో సీసీఐ ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరిగింది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇక విశాఖలో గుగూల్ డేటా సెంటర్ సైతం ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
For More AP News And Telugu News