Share News

CEC Gyanesh Visits Srisailam: శ్రీశైలానికి చేరుకున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. జై భారత్- జై హింద్ అంటూ నినాదాలు..

ABN , Publish Date - Dec 19 , 2025 | 09:07 PM

డిసెంబర్ 20న ఉదయం శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో మహాహారతి కార్యక్రమంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దంపతులు పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరుతారు. అక్కడ గోల్కొండ కోట, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు.

CEC Gyanesh Visits Srisailam: శ్రీశైలానికి చేరుకున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. జై భారత్- జై హింద్ అంటూ నినాదాలు..
CEC Gyanesh Visits Srisailam

నంద్యాల: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల(Srisailam Mallikarjuna Swamy Temple)ను భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar) దంపతులు దర్శించుకున్నారు. జ్ఞానేశ్ కుమార్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు స్వామీఅమ్మవార్ల దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా సీఈసీ మాట్లాడుతూ.. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పరమశివుడు, అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. అనంతరం 'జై భారత్- జై హింద్' నినాదాలు చేశారు.


కాగా, మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జ్ఞానేశ్ కుమార్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి జ్ఞానేశ్ కుమార్ దంపతులు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి, పలువురు ఎన్నికల అధికారులు సీఈసీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డుమార్గాన ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు.


సీఈసీ పర్యటన వివరాలు ఇవే..

డిసెంబర్ 20న ఉదయం శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో మహాహారతి కార్యక్రమంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దంపతులు పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరుతారు. అక్కడ గోల్కొండ కోట, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. డిసెంబర్ 21న హైదరాబాద్‌ రవీంద్రభారతి ఆడిటోరియంలో తెలంగాణ బూత్ లెవల్ ఆఫీసర్ల(BLO)తో ఆయన సమావేశం అవుతారు. ఎన్నికల ప్రక్రియ సహా పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. మూడో రోజు పర్యటన అనంతరం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి:

OM Birla Tea Party: మోదీ, రాజ్‌నాథ్, ప్రియాంక కలిసి ఫోటో.. టీ పార్టీలో సరదా ముచ్చట్లు

Tamil Nadu And Gujarat SIR: తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్‌లో 73 లక్షల ఓట్లు తొలగింపు

Updated Date - Dec 19 , 2025 | 09:15 PM