Share News

Tamil Nadu And Gujarat SIR: తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్‌లో 73 లక్షల ఓట్లు తొలగింపు

ABN , Publish Date - Dec 19 , 2025 | 08:33 PM

ఎస్ఆర్ఎఫ్ మొదటి ఫేజ్‌లో మొత్తం 6,41,14,587 మంది ఓటర్లకు గాను రికార్డు స్థాయిలో 5,43,76,755 ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలు సమర్పించారని, ఓటర్ల పార్టిషిపేషన్ 84 శాతం ఉన్నట్టు తమిళనాడు సీఈఓ కార్యాలయం తెలిపింది.

Tamil Nadu And Gujarat SIR: తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్‌లో 73 లక్షల ఓట్లు తొలగింపు
SIR draft voter list

న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు విడుదల చేసింది. డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం నాటికి 6.41 కోట్ల ఓటర్లకు గాను 5.43 కోట్ల మంది దరఖాస్తులు సమర్పించారు. రికార్డు స్థాయిలో 97 లక్షల మందికి పైగా (15 శాతం) ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సవరణ తర్వాత తమిళనాడులో మొత్తం ఓటర్ల సంఖ్య 5.43 కోట్లుగా తేలింది.


ఫేజ్1లో రికార్డు స్థాయిలో ఓటర్ల నమోదు

ఎస్ఆర్ఎఫ్ మొదటి ఫేజ్‌లో మొత్తం 6,41,14,587 మంది ఓటర్లకు గాను రికార్డు స్థాయిలో 5,43,76,755 ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలు సమర్పించారని, ఓటర్ల పార్టిషిపేషన్ 84 శాతం ఉందని తమిళనాడు సీఈఓ కార్యాలయం తెలిపింది. తొలగింపులో 26 లక్షల 94 వేల 672 మందిని మరణించిన ఓటర్లుగా తేల్చింది. 66,44,881 మంది ఓటర్లు బదిలీ అయ్యారని, మరో 3,39,278 మంది వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్లుగా ఉన్నారని తెలిపింది.


డిసెంబర్ 19 నుంచి 2026 జనవరి 19 వరకూ ఓటర్లు తమ క్లెయిమ్స్, అభ్యంతరాలు సమర్పించవచ్చని, మార్పులు, చేర్పులు, సవరణలు, వెరిఫికేష్లనకు అవకాశం ఉందని తెలిపింది. అర్హులైన ఓటర్లు ఓటుహక్కు కోల్పోకుండా ఆన్‌లైన్ పోర్టల్స్‌, బూత్ లెవెల్ అధికారులు, డిజిగ్నేటెడ్ సెంటర్లలో సంప్రదించాలని కోరింది.


గుజరాత్‌లో...

గుజరాత్‌లోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తికావడంతో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. మొత్తం 5.08 కోట్ల మంది ఓటర్లకు గాను 4.34 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. దీంతో ముసాయిదా జాబితాలో చోటుచేసుకున్న ఓటర్ల సంఖ్య 4.34 కోట్లుగా తేలింది. 73.73 లక్షల ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. వీరిలో మరణించిన ఓటర్లు 18,07,278 మంది ఉండగా, ఆబ్సెంట్ అయిన ఓటర్లు 9,69,662 మంది, శాశ్వతంగా మైగ్రేట్ అయిన ఓటర్లు 40,25,553 మంది, రెండు చోట్ల పేర్లు నమోదు చేసుకున్న వారు 3,81,470 మంది, ఇతర కారణాలతో ఓటర్ల జాబితాలో చోటుచేసుకోని వారు 1,89,364 మంది ఉన్నట్టు తెలిపింది.


ఓటర్ల జాబితాలో చోటుచేసుకోని వారు తమ క్లెయిమ్స్, అభ్యంతరాలను 2026 జనవరి 18 వరకూ సమర్పించవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 10వ తేదీతో ఓటర్ల జాబితా వెరిఫికేషన్ 'ఫైనల్ ఫేజ్' ముగుస్తుందని, 2026 ఫిబ్రవరి 17న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

రెండున్నరేళ్ల ఎగ్రిమెంట్ ఏమీ లేదు.. సిద్ధరామయ్య క్లారిటీ

ఆ సీట్ల కోసం షిండే పట్టు.. మహాయుతిలో విభేదాలు తీవ్రం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 19 , 2025 | 08:46 PM