Siddaramaiah: రెండున్నరేళ్ల ఎగ్రిమెంట్ ఏమీ లేదు.. సిద్ధరామయ్య క్లారిటీ
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:25 PM
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించనున్నారంటూ ఇటీవల ఊహాగానాలు ఊపందుకోవడంతో పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుంది. ఒకరినొకరు విందు సమావేశాలకు ఆహ్వానించుకుని కూర్చుని మాట్లాడుకోవాలని సూచించింది.
బెళగావి: కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి స్పందించారు. రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకోవాలనే అగ్రిమెంట్ అనేదే లేదని, తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పారు.
సీఎం పదవీకాలంపై విపక్షాలు పదేపదే ప్రశ్నిస్తుండటంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం నిర్ణయించేంత వరకూ తానే ముఖ్యమంత్రినని చెప్పారు. 'మొదట ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ తర్వాత లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో శాసనసభ్యులు తమ నేతను ఎన్నుకున్నారు. ఆ తర్వాత అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇంతమాత్రమే చెప్పగలను. ఇప్పటికీ నేనే సీఎంను. అధిష్ఠానం నిర్ణయం తీసుకునేంత వరకూ సీఎంగానే కొనసాగుతాను' అని సిద్ధరామయ్య చెప్పారు. రెండున్నరేళ్ల పదవీకాలం గురించి తానెప్పుడూ చెప్పలేదని, అలాంటి అగ్రిమెంట్ కూడా ఏదీ లేదని ఆయన వివరణ ఇచ్చారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించనున్నారంటూ ఇటీవల ఊహాగానాలు ఊపందుకోవడంతో పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుంది. ఒకరినొకరు విందు సమావేశాలకు ఆహ్వానించుకుని కూర్చుని మాట్లాడుకోవాలని సూచించింది. దీంతో తొలుత సిద్ధరామయ్య డీకేను బ్రేక్‌ఫాస్ట్ కోసం తన ఇంటికి ఆహ్వానించారు. అనంతరం డీకే సైతం సిద్ధరామయ్యకు విందు ఇచ్చారు. కాగా, సిద్ధరామయ్య-డీకే మధ్య గొడవల కారణంగా రాష్ట్ర ప్రయోజనాలను నిర్లక్ష్యానికి గురవుతున్నాయంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఆ సీట్ల కోసం షిండే పట్టు.. మహాయుతిలో విభేదాలు తీవ్రం
బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్.. ఆయన.. ఓ ఔట్ గోయింగ్ సీఎం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి