Parliament Winter Sessions: లోక్‌సభ నిరధిక వాయిదా.. ఆమోదం పొందిన కీలక బిల్లులు ఇవే..
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:49 AM
డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. మొత్తం 15 రోజుల పాటు సాగిన సమావేశాల్లో లోక్ సభ పలు కీలక బిల్లులను ఆమోదించింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో(శుక్రవారం) ముగిశాయి. లోక్‌సభ నిరవదిక వాయిదా పడింది. డిసెంబర్ 1వ తేదీన సమావేశాలు మొదలయ్యాయి. 19వ తేదీ (ఈరోజు) వరకు కొనసాగాయి. మొత్తం 15 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగాయి. సమావేశాల సందర్భంగా లోక్‌సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.
లోక్ సభ ఆమోదం తెలిపిన కీలక బిల్లులు..
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వీబీ జీ రామ్ జీ’ పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
అణు ఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(శాంతి) బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది.
బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచే బీమా సవరణ బిల్లు (సబ్ కా బీమా సబ్ కా రక్ష)ను ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభ ఆమోదించింది.
మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(రెండవ సవరణ)బిల్లు 2025 కి లోక్ సభ ఆమోదం తెలిపింది.
సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2025.
నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025.
సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు 2025.
ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025.
జన్ విశ్వాస్(నిబంధనల సవర) బిల్లు,
దివాళా, దివాళా కోడ్ (సవరణ) బిల్లు.
పారదర్శకంగా భూసేకరణ కోసం జాతీయ రహదారుల(సవరణ) బిల్లు.
కంపెనీల చట్టం సవరించడానికి కార్పొరేట్ చట్టలు(సవరణ) బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి
దారుణం.. అద్దె అడిగినందుకు చంపి.. సూట్‌కేసులో కుక్కి..
ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు.. సుప్రీం ఆదేశం