BMC Polls: ఆ సీట్ల కోసం షిండే పట్టు.. మహాయుతిలో విభేదాలు తీవ్రం
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:16 PM
బీఎంసీతో పాటు మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్‌ను డిసెంబర్ 25న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2026 జనవరి 15న ఒకే విడతలో ఈ ఎన్నికలు జరుగనున్నారు. జనవరి 16న ఫలితాలు వెలువడతాయి
ముంబై: మహారాష్ట్ర (Maharshtra)లో త్వరలో జరుగనున్న బీఎంసీ (BMC) ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో షిండే సారథ్యంలోని శివసేన, బీజేపీ మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. 2017 బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ ఆ సమయంలో ఐక్య శివసేన గెలిచిన 84 సీట్లు తమకే కేటాయించాలని షిండే శివసేన డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ డిమాండ్‌ను బీజేపీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్టు సమాచారం.
ప్రస్తుత పరిస్థితికి, 2017 నాటి పరిస్థితికి చాలా తేడా ఉందని బీజేపీ వాదనగా ఉంది. షిండే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన మధ్య ముఖాముఖీ పోటీ వల్ల మహాయుతి కూటమికి నష్టం జరుగుతుందని బీజేపీ చెబుతోంది. షిండే శివసేన ఎక్కడైతే బలంగా ఉందో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయో ఆయా సీట్లను మాత్రమే కేటాయించగలమని బీజేపీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. బీఎంసీలోని 227 సీట్లలో ఇరు పార్టీల మధ్య 77 సీట్ల విషయంలో విభేదాలు తలెత్తాయి. రాబోయే రెండు రోజుల్లో ఈ ప్రతిష్ఠంభనకు తెరపడే ఆవకాశం ఉంది.
పోలింగ్ షెడ్యూల్
బీఎంసీతో పాటు మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్‌ను డిసెంబర్ 15న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2026 జనవరి 15న ఒకే విడతలో ఈ ఎన్నికలు జరుగనున్నారు. జనవరి 16న ఫలితాలు వెలువడతాయి.
కమిటీ ఏర్పాటు
బీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం ముంబై బీజేపీ అధ్యక్షుడు అమిత్ సతమ్ 20 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. అమిత్ సతమ్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్.. ఆయన.. ఓ ఔట్ గోయింగ్ సీఎం..
అగ్రహీరో కమల్‌హాసన్ కీలక నిర్ణయం.. ఆ... పార్టీకే మద్దతు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి