Home » Shiv Sena
పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లాంఛనంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారంనాడు లేఖ రాసింది. పార్లమెంటులో శివసేన యూబీటీ మాత్రమే అధికారిక గుర్తింపు కలిగిన పార్టీ అని ఆ లేఖలో తెలియజేసింది.
శివసేన (యూబీటీ) చీలిపోనుందంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. మరో పార్టీలోకి చేరాలనుకున్న ఏ ఎంపీ అయినా మొదట పార్టీ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు.
శివసేన (యూబీటీ)లో చీలిక ఏర్పడనుందని, ఏడుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎంపీలను పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ.50 కోట్ల కనీస మద్దతు ధర నిర్ణయించారని, అందులో రూ.15 కోట్లు అడ్వాన్స్ ఇస్తున్నారని రౌత్ ఆరోపించారు.
నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బీఎంసీతో పాటు మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్‌ను డిసెంబర్ 25న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2026 జనవరి 15న ఒకే విడతలో ఈ ఎన్నికలు జరుగనున్నారు. జనవరి 16న ఫలితాలు వెలువడతాయి
ప్రాథమిక సమాచారం ప్రకారం, నిర్మలా గావిత్ సోమవారం సాయంత్రం నాసిక్‌లోని తన నివాసం వెలుపల వాకింగ్ చేస్తుండగా వేగంగా దూసుకువచ్చిన కారు వెనక వైపు నుంచి ఢీకొంది.
జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా పాక్‌పై భారత్ పలు ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
దక్షిణ భారతీయులపై శివసేన శిందే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వక్ఫ్ బిల్లు బుజ్జగింపు బిల్లు కాదని, అభ్యున్నతి బిల్లు అని ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండే అన్నారు. ఈ బిల్లు దేశం కోసం ప్రవేశపెట్టిన బిల్లే కానీ నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా తీసుకువచ్చినది కాదని చెప్పారు.
అతిథులను దేవుడిగా భావించే సంస్కృతి ముంబైలో ఉందని, కునాల్ తనను తాను ముంబైకి అతిథిగా చెప్పుకుంటున్నారని, అలాంటపప్పుడు భయపడటం ఎందుకని రాహుల్ కనల్ ప్రశ్నించారు.