Kamal Hasan: అగ్రహీరో కమల్‌హాసన్ కీలక నిర్ణయం.. ఆ... పార్టీకే మద్దతు
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:59 AM
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఎన్‌ఎం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు కమల్‌హాసన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయమని, అన్నాడీఎంకేకు ఓటమి తప్పదని కమల్ అన్నారు.
- డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేస్తా..
- ఎంఎన్‌ఎం నేత కమల్‌హాసన్
చెన్నై: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేస్తానని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్(Kamal Hasan) ప్రకటించారు. ఆయన గురువారం త్రిశూలంలోని స్వదేశీ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ చట్టం పేరును కేంద్రప్రభుత్వం ‘వీబీ-జీరామ్‌జీ’గా మార్చడంపై మీడియా ప్రశ్నించగా, కేంద్రపథకాల పేర్లు మార్పు చేయడంపై స్పందించాల్సిన అవసరం లేదని,

అయితే కేంద్రం నుండి రాష్ట్రప్రభుత్వానికి రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాలు తగ్గుతుండటంపై నిలదీయాల్సిన అవసరం ఉందని కమల్ పేర్కొన్నారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీ కూటమికి అనుకూలంగా ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు ఇది ప్రజల నిర్ణయమని కమల్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను డీఎంకేకు మద్దతుగా తప్పకుండా ప్రచారంలో పాల్గొంటానని కమల్ హామీ ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..
కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు
Read Latest Telangana News and National News