Nandyal: నంద్యాల విజయ పాల డెయిరీ వద్ద హై టెన్షన్
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:57 PM
నంద్యాల జిల్లా ముత్యాలంపాడు గ్రామంలో జరిగిన సొసైటీ ఎన్నికల్లో భూమ విఖ్యాత్ రెడ్డి విజయం సాధించారు. ఆయన డెయిరీకి అప్పు ఉన్నట్లు డెయిరీ యాజమాన్యం డిఫాల్టర్ నోటీసులు జారీ చేసింది.
నంద్యాల జిల్లా ముత్యాలపాడు గ్రామంలో జరిగిన సొసైటీ ఎన్నికల్లో భూమా విఖ్యాత్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే, భూమా విఖ్యాత రెడ్డి డెయిరీకి ఉన్న అప్పును చెల్లించాలంటూ డిఫాల్టర్ నోటీసులు ఇచ్చింది వియజ పాల డెయిరీ యాజమాన్యం. దీనిపై వివరణ ఇవ్వడానికి డెయిరీ వద్దకు వచ్చారు విఖ్యాత్ రెడ్డి. కానీ అక్కడ డెయిరీ యాజమాన్యం కానీ, దానికి బాధ్యత వహించే అధికారులు కానీ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో విఖ్యాత్ రెడ్డి ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
డెయిరీకి తాను వస్తున్న విషయం తెలిసి కూడా యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విఖ్యాత్ రెడ్డి కోపంతో ఊగిపోయారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. విషయం తెలసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని డెయిరీ పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
AP minister Kollu Ravindra: జగన్ బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి: మంత్రి కొల్లు రవీంద్ర
Nara Lokesh: ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించడం వైసీపీ తరం కాదు: మంత్రి లోకేశ్