Share News

AP minister Kollu Ravindra: జగన్ బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Dec 19 , 2025 | 05:03 PM

మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర పీపీపీ విధానంపై జగన్ విమర్శల గురించి స్పందించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర హితవు పలికారు.

AP minister Kollu Ravindra: జగన్ బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి: మంత్రి కొల్లు రవీంద్ర
Kollu Ravindra comments

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని, మెడికల్ కాలేజీలపై వైసీపీ సేకరించిన కోటి సంతకాలు బోగస్ సంతకాలే అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. బెదిరింపు చర్యలతో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర పీపీపీ విధానంపై జగన్ విమర్శల గురించి స్పందించారు (Kollu Ravindra fire on YS Jagan).


'వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పీపీపీ విధానాన్ని కొనసాగించారు. కానీ జగన్‌కు మాత్రం పీపీపీ విధానం నచ్చడం లేదు. పీపీపీ విధానంలో గతంలో జరిగిన అభివృద్ధి జగన్‌కు కనిపించడం లేదు. కేవలం రాజకీయ స్వలాభం కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై విష ప్రచారం చేస్తున్నారు. జగన్ విధ్వంసకర మాటలు మాట్లాడుతున్నారు' అంటూ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు (YS Jagan political row).


జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, కేవలం పగటి కలలు కంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు (Kollu Ravindra comments). పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయడం వల్ల మెడికల్ సీట్లు పెరుగుతాయని, పేదలకు వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. అలాగే జగన్ వ్యాప్తి చేస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

గుడివాడ పీఎస్‌కు జగన్ బంధువు

జగన్‌‌కు అన్నీ ఎదురుదెబ్బలే.. వాళ్లకు దొరికింది అదొక్కటే: ఎంపీలతో సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 19 , 2025 | 05:03 PM