Share News

CM Chandrababu: జగన్‌‌కు అన్నీ ఎదురుదెబ్బలే.. వాళ్లకు దొరికింది అదొక్కటే: ఎంపీలతో సీఎం

ABN , Publish Date - Dec 19 , 2025 | 02:00 PM

ఢిల్లీ పర్యటనలో భాగంగా కూటమి ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఎంపీలకు కీలక సూచనలు చేశారు.

CM Chandrababu: జగన్‌‌కు అన్నీ ఎదురుదెబ్బలే.. వాళ్లకు దొరికింది అదొక్కటే: ఎంపీలతో సీఎం
CM Chandrababu

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే కూటమి ఎంపీలతోనూ సీఎం సమావేశమయ్యారు. కూటమి ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సుమారు 40 నిమిషాల పాటు ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాల విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎక్కువ ఎదురుదెబ్బలే తగులుతున్నాయని అన్నారు.


ఒక్క వైద్య కళాశాలలు పీపీపీ వ్యవహారం మాత్రమే వాళ్లకి దొరికిందని తెలిపారు. ఆ విషయంలో కూడా ప్రజలు వాళ్లకి అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కోటి సంతకాల పేరుతో డ్రామా చేయాలని చూశారని.. అది కూడా విఫలమే అయ్యిందని తెలిపారు. ఢిల్లీ స్థాయిలో కూడా పీపీపీ విధానంపై అధ్యయనం చేయాలని ఎంపీలను సీఎం కోరారు.


ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నడుస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రికి పలువురు ఎంపీలు వివరించారు. ‘మనకి గుర్తింపు పెరుగుతున్న కొద్దీ మనపై బాధ్యత ఎక్కువ అవుతుంది’ అని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఉందని ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

గుడివాడ పీఎస్‌కు జగన్ బంధువు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 19 , 2025 | 02:21 PM